అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, January 23, 2011

మర్చిపోలేక పోతున్నా..

చిన్నప్పటినుండి ఒకే దగ్గర అన్నాదమ్ముళ్లకంటే ఎక్కువగా కలిసిమెలిసి పెరిగిన ఆత్మీయుడి లోటు తీర్చలేనిది. ఆ స్మృతులు మరవలేనివి. నేను మా నర్సింహ అలాగే  చిన్నప్పటినుండి ఒకే దగ్గర తిన్నాము ఒకే దగ్గర పడుకున్నాము కలిసిమెలిసి పెరిగాము. నన్ను స్కూళుకు తీసుకెళ్లింది. నాచేత పాలు మరిపించింది. నేను గెలిస్తే మెచ్చుకుంది, ఎప్పుడు చూసినా నవ్విస్తూ ఏడిపించింది. ఇప్పుడు శాశ్వతంగా ఏడిపించి వెళ్లిపోయింది మా నర్సింహ.... అఖిల్‌, సింహ అని పిలవమనే వాడు కానీ నాకు నర్సింహ అని పిలవడం అంటేనే ఇష్టం. చిన్నప్పుడు తను హాస్టల్‌కి వెళ్లాడని నేను హాస్టల్‌కి వెళ్తానని ఏడ్చాను కానీ తను హాస్టల్‌ విడిచి వచ్చిన తర్వాత నేను హాస్టల్‌కి వెళ్లా... ఎన్ని రోజులు హాస్టల్‌కి వెళ్లివచ్చినా పడుకునేది... తినేది మాత్రం నర్సింహ దగ్గరే....
చిన్నప్పుడు స్కూళ్లో నర్సింహ వెనకాల కూర్చునేందుకు పక్కవారితో కొట్లాడేవాడిని ఇప్పుడు ఎవరితో కొట్లాడాలి. ఎక్కడ కూర్చోవాలి. పెద్దయ్యాక కూడా నేను క్రికెట్‌ ఆడుతుంటే చూడటం, తను నా ప్రత్యర్థి టీంలో ఉండటం నేను  ఔటయితే ఏడిపించడమంటే తనకు చాలా ఇష్టం. నేను ఏ టోర్నమెంటు ఆడి వచ్చినా మొత్తం తనకు వర్ణించి వివరించి చెప్పేవాణ్ణి. తనూ ఎంతో ఎంకరేజ్‌ చేసేవాడు. నా లైఫ్‌లో మా నాన్న చనిపోయినప్పుడు కూడా అంతలా ఏడ్వలేదు. నన్ను నవ్వించి ఎక్కిరించి ఇప్పుడు ఏడిపించి వెళ్లిపోయిన సింహ నేను త్వరలోనే వస్తా ఏం బాధ పడకు నీ పక్క ప్లేసులో ఎవర్నీ కూర్చోనియ్యకే............
సుందర్

2 comments: