అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, February 3, 2011

నన్ను చాలా ఆకర్శించింది

కళ అనేది ఒకరి సొత్తు కాదు. కళ ఒక అద్భుతమైన విన్యాసం కావచ్చు, చాతుర్యం కావచ్చు ఇంకా పరిపూర్ణత్వం కావచ్చు  ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. కొంత మంది చాలా బాగా పాడగలరు. కొంత మంది అనర్గలంగా మాట్లాడగలరు. కొంత మంది  బాగా విశ్లేషించగలరు. కొంతమంది చాలా అద్భుతంగా ఆడగలరు. ఇలా చెబుతూ పోతే అనేక కళారూపాలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. ఇక నేను చెప్పేది దేనిగురించంటే నేను అలా దారెంట వెళ్తున్నానా...పక్కనే ఒక చిన్న అమ్మాయి. సుమారు పది పన్నెండు ఏళ్లుంటాయి. ఒక సన్నటి తీగ మీద ఏ ఆదారం లేకుండా కళ్లకు గంతలు కట్టుకుని నడుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి నా ఒళ్లు గగుర్పొడిచింది. ఒక వేళ ఆ అమ్మాయి పడిపోతే....
అనే ఆలోచన రాగనే చెమటలు పట్టాయి.  ఒక్కోఅడుగువేస్తూ.... అప్పుడప్పుడు కొద్దిగా.. తూలుతూ .... మళ్ళీ బాలన్సు చేసుకుంటూ....  ఆ అమ్మాయి కళ్లు మూసుకునే  తీగను అవలీగా దాటేసి వెళ్లింది. తర్వాత ఒంటి కాలిపై సైకిల్‌ రీం సహాయంతో వెళుతోంది. అరే నాకు ఒక పదడుగుల ఎత్తుపైనుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అంత ఎత్తులో  చిన్న అమ్మాయి ఎంత అద్భుతంగా చేసిందంటే అబ్బబ్బబ్బా.... కోటి రూపాయలిచ్చినా తక్కువే అనిపించింది. ఇంకా చిన్న రింగు నుంచి ఇద్దరు ముగ్గురు దూరడం లాంటి చాలా చిత్రమైన విన్యాసాలు వేశారు. ఎంతో ఓర్పుగా చూసిన చాలా మంది వారికి డబ్బులు వేయకుండానే వెళ్లారు. కొంత మంది తమకు తోచినంత వేశారు. అయినా వారి ముకాల్లో చిరునవ్వు చెదరలేదు. అంతటి అద్భుత కళాకారులు ఇలా వీదులల్లో వారి కళను అమ్ముకుంటూ... దిన దిన గండంగా బ్రతకడమేంటి అనే ఆలోచనలతో రూంకి బయలు దేరాను..


- సుందర్

3 comments:

  1. మా చిన్నప్పుడు ఊళ్ళొకొచ్చి చేసేవారండీ...తరవాత చూళ్ళేదు...ఆనంద భైరవి సినిమాలో చూడ్డమే..నాకూ భలే ఇష్టం..జాలి వేస్తుంది కూడా..

    ReplyDelete
  2. సుందర్ గారు, గారడి/కనికట్టు అనేవి మనదెశంలొ అనాదిగా ఉన్న విద్యలు. ప్రస్తుతం మనదెశములొ నిరాదరణకి గురి అయ్యాయి. అందరికి కష్టసాద్యముగా తొచె తీగమీద నదవదం, వెదురుబొంగుపై గిరగిరా తిరగదం లాంటి వన్నీ చాలా సునాయసముగా ప్రదర్శించి జీవనోపాధిని కూడా పొందలెకపొతున్నరు. అటువంటి కళని గురించి ప్రస్తావించిన మీకు నా అబినందనలు.

    ReplyDelete
  3. సుందర్ గారు, గారడి/కనికట్టు అనేవి మనదెశంలొ అనాదిగా ఉన్న విద్యలు. ప్రస్తుతం మనదెశములొ నిరాదరణకి గురి అయ్యాయి. అందరికి కష్టసాద్యముగా తొచె తీగమీద నదవదం, వెదురుబొంగుపై గిరగిరా తిరగదం లాంటి వన్నీ చాలా సునాయసముగా ప్రదర్శించి జీవనోపాధిని కూడా పొందలెకపొతున్నరు. అటువంటి కళని గురించి ప్రస్తావించిన మీకు నా అబినందనలు.

    ReplyDelete