అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, February 1, 2011

ఆ ఐడియాలకు రూపం ఇస్తే....

ఒక్కో సారి బీభత్సమైన ఐడియాలు వస్తాయి. ఎంతో ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అందులో కొన్ని ప్రయోజనాలను చేకూర్చేవయితే... మరికొన్ని టైంపాసింగ్‌ ఐడియాలు. బస్‌లో ప్రయాణించేటప్పుడో, ఇంట్లో వంటరిగా కూర్చున్నప్పుడో ఒక మాంచి ఐడియా మన మెదడును తడుతుంది. ఆ ఆలోచనకు ప్రాణం పోస్తే గనక ప్రపంచాన్నే జయించొచ్చనుకుంటాం కానీ
అది ఆచరణలో చూపేందుకే తడబడతాం... ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే మొహమాటం, సిగ్గూ మన రత్నాల్లాంటి ఆలోచనల్ని మెదడు పొరల్లోనే దాచేస్తాయి. ఎప్పుడూ పెదవి అంచును దాటేందుకు ప్రయత్నించవు కొంత మంది ప్రయత్నరూపం దాల్చినా ఆరంభ శూరత్వంగానే ఉంటుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్‌ ఆపిల్‌ చాలా సార్లు చూసినప్పటికీ ఒక సారి మాత్రమే ఆయనకు ఎందుకు పడుతుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు కార్యరూపమివ్వడం మొదలు పెట్టాడు. మొదట అది విన్న వాళ్లకు చాలా సిల్లీ గా అనిపించింది. చాలా మంది హేళన చేశారు. కాని అతను ప్రయోగాత్మకంగా నిరూపించిన నాడు నవ్విన వాళ్లే జేజేలు పలికారు. అందుకే మనకు వచ్చే ఏ ఐడియానైనా సరే సమంజసంగా అనిపిస్తే ఇంప్లిమెంట్‌ చేయడానికి ప్రయత్నించిన నాడే మనకు సమాజంలో ఒక గుర్తింపు మన మనసుకు ఒక సాటిస్‌ఫాక్షన్‌ లభిస్తుంది. మీకు ఇలాంటి ఐడియాలు వస్తే నాతో షేర్‌ చేసుకుంటారని ఆశిస్తూ..


సుందర్

No comments:

Post a Comment