అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, February 4, 2011

మానవతా విలువలు మంటగలిసిన వేళ

దిల్‌సుఖ్‌ నగర్‌ అంటే చాలా రద్దీ ప్రదేశం అదీ ఉదయం పది పదకొండు గంటలకు అంటే ఇక ప్రాంతం ఎంత రద్ధీగా ఉంటుందో ఊహించొచ్చు సరిగ్గా అప్పుడే బస్టాండ్‌నుండి సినిమా థియేటర్‌ వైపు వెళ్తున్నా. రోడ్డు పక్కనే ఒక ముసలాయన పడిఉన్నాడు. అతడు మూర్చపోయి పడ్డడా...? తాగి పడ్డాడా లేక ఇంకెందుకు అక్కడ పడిపోయాడో తెలియదు కాని స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అంత మంది ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు పక్కనుంచే నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువైపు చూస్తున్నారు.మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృష్యం హృదయ విదారకంగా కనిపిస్తుంది. మా ఫ్రెండ్సేమో సినిమాకు టైం అవుతుంది నడవరా అంటూ లాక్కెల్లారు సినిమా హాల్లో ఉన్నానే తప్పా ఆ సినిమా నడుస్తున్నంత సేపు అదే ఆలోచించాను.  ఉరుకులు పరుగుల సమాజంలో కనీస మానవతా విలువలు మర్చిపోయి సాగుతున్న ఈ ప్రయానం  ఎక్కడికో ..  అనుకుంటూ ముందు నన్ను నేను తిట్టుకున్నాను ఒక మనిషి దిక్కుతోచని స్థితిలో ఉంటే సినిమా కావల్సివచ్చిందా అనుకుంటూ... మనసంతా ఒకటే అలజడి. సినిమా అయిపోగానే వెళ్లి చూస్తే అక్కడ అతను లేడు కొంచెం మనసు తేలిక పడినప్పటికీ అందరితోపాటూ నేనూ అలాగే వెళ్లడాన్ని నా హృదయం నన్నింకా నిందిస్తూనే ఉంది.

సుందర్

No comments:

Post a Comment