ఈ మధ్యన ఒక సారి మా స్నేహితుని దగ్గరికి (పవన్ మామ) వెళ్లాను. మనకు ఒక అలవాటు ఏడ్చి సచ్చింది. కనబడిన పుస్తకాన్నళ్లా చదవడం. అతని రూంలో బుక్స్ గురించి వెతుకుతున్నా.. అప్పుడే శోభన్ బాబు లైఫ్ హిస్టరి గురించిన ఒక పుస్తకం దొరికింది ఏంటో అనుకుంటూ చదవడం మొదలు పెట్టాను. చాలా వరకు చదివాను కాని అందులో ఒకే ఒక వాఖ్యం నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఒక రోజు శోభన్‌బాబు అతనితో పాటు మరో పాపులర్ ఆర్టిస్టు షూటింగ్ పనిమీద వేరే రాష్ట్రానికో, వేరో దేశానికో అంత గుర్తు లేదు కాని మన రాష్ట్రం విడిచి వెళ్లారు. అక్కడ రోడ్డు పై చాలాసేపు వారికి కావల్సిన వారికోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారు ఎంతకూ రావట్లేదు. వచ్చిపోయే వాళ్లు మాత్రం వాళ్లను గమనించకుండానే వెళ్తున్నారు. అప్పుడు అన్నాడట శోభన్‌బాబు మనల్ని గుర్తు పట్టే వాళ్లున్నంత వరకే మనం సెలబ్రిటీలం మనల్ని గుర్తు పట్టేవాళ్లు లేకపోతే అనామకులం అన్నాడట ఆ వాఖ్యం నాకు చాలా బాగా నచ్చింది.
సుందర్
సుందర్
ante kada mana raajakeeya nayakulu mana daggara maatrame pojulu kodutaaru.. Delhi vellarante veedhi kukkalu kuda vaarini pattinchukovu mari.. shobhan babu annadi correcte kada..(kakapote, gurtu pattadam veru, venta tiragadam veru :))
ReplyDelete