అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, February 7, 2011

బతుకులు మారేదెప్పుడో ...? బాధలు తీరేదెన్నడో...?

"అన్నార్దులు, అనాదులుందని ఆ నవయుగమదెంత దూరం" అన్నాడో కవి..
మనం నిత్యం చూస్తుంటాము కోఠి, దిల్‌సుక్‌నగర్‌, ఎంజిబిఎస్‌ మొదలైన బస్టాండ్ల ముందు అనేక  మంది బిక్షగాళ్లు ఉంటారు. అయ్యా బాబు, అమ్మా అంటూ దీనంగా అడుక్కుంటుంటారు. కొద్ది మంది పని చేసుకునే స్తోమత ఉన్నా... అడుక్కుంటారు. అదేం పోయే బుద్దో.. మరి కొంతమంది. పనిచేసుకోవడానికి వయసు, శరీరం సహకరించక బిక్షమేత్తుతూ... జీవనం వెళ్ళదీస్తుంటారు. వాళ్ళు ఎక్కడ పండుకుంటారో.... ఎప్పడు లేస్తారో... వారికే  తెలియదు..
రాత్రిళ్లు అక్కడక్కడ పుట్‌పాత్‌లపైన  పడుకునేందుకు కుస్తీలు పడుతుంటారు. వీళ్ళు అక్కడికి రాగానే ఆయా షాపుల వాళ్ళు తిట్టి వెల్లగోడుతుంటారు. అయినా వాళ్ళు వెళ్లి పోగానే అక్కడ ఆదరా బాదరా పడుకుంటారు.   పొద్దంతా అడుక్కుని, రాత్రిళ్ళు ఎవరో విసిరేసిన  పులిసిన మెతుకులు  తిని  మిగతాది పొద్దునకు కవర్లలో దాచుకుంటారు. నిద్ర పడుతుందో లేదో. చలికి, వొణుకుతూ, వానకు తడుస్తూ కంటినిండా కునుకు లేకుండా మళ్ళీ ఎప్పుడో తెల్లవారక ముందే లేచి వాళ్ళ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తూ ఉంటారు. 
కొందరికి రెండు కాళ్లు ఉండవు, కొందరికి రెండు చేతులు ఉండవు కొందరికైతే మొత్తం కాళ్లు చేతులు ఉండవు. కొంత మంది కుష్ఠురోగులు ఎండలో కూర్చుని కాళ్లు చేతులు ఆడిస్తూ వాళ్లు తల్లడిల్లుతున్న తీరు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఇన్ని కష్టాలకోర్చి వాళ్లు ఎండనకా వాననకా.... అలా రోడ్లెంబగి తిరుగుతూ... అడుక్కుంటుంటే రూపారయో ఆటానో.... ఇచ్చినవాళ్లు ఇయ్యంగా తిట్టివాళ్లు తట్టంగా.... దినదిన గండం నూరేళ్లాయుష్యుగా సాగుతున్న వారి బతుకులు, బాగుపడేదెన్నడో..... 
సుందర్

No comments:

Post a Comment