అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, March 13, 2011

గాచారం గంటే మారేతో....

గాచారం గంటే మారేతో కుదా బి కర్‌ నై సక్తా అనే డైలాగ్‌ వినే ఉంటారు. నిజంగా టీం ఇండియా పరిస్థితి కూడా అలాగే తయారైంది. ముఖ్యంగా 268 పరుగులకు ఒకే ఒక్క వికెట్‌తో పటిష్టంగా ఉన్న భారత్‌ సచిన్‌ ఔట్‌ కావడంతో అందరూ క్యూకట్టారు. 350 స్కోరు సింపుల్‌గా చేస్తారనుకున్న టీం 296 పరుగులకే కుప్పకూలడంతో ఆశ్చర్యపోని క్రికెట్‌ అభిమాని ఉండండంటే అతిశయోక్తి కాదు. కానీ ఏం జేస్తం అన్ని రోజులు ఆదివారాలు కాదు కదా...? మన వాళ్లు స్కోరును పెంచాలనే తాపత్రయంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కనీసం మూడొందల పరుగులు కూడా చేయలేకపోయారు.అలాగే దక్షిణాఫ్రికా చివరి ఓవర్‌లో పరుగులు సాధించిన తీరు కూడా అలాగే ఉంది. నెహ్రా వేసిన మొదటి బంతి బ్యాట్‌కు ఇన్‌సైడ్‌ ఇడ్జ్‌లో తాకి బౌండరీ వెళ్లడం దాని తర్వాతనే టెన్షన్‌తో పీటర్సన్‌ కొట్టిన బంతి ఏకంగా గ్రౌండ్‌ అవతల లాంచ్‌ అవ్వడం ఇండియా పరాజయం ఒక్కసారే జరిగాయి. అంతా మన మంచికే అనుకోవాలి మనం నెక్స్‌ రౌండ్‌ బెర్తు ఎలాగూ ఖరారు చేసుకున్నాం. అద్భుతాలు జరిగితే తప్ప దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక ఓటమి అంటారా మనం 1983లో కప్‌ గెలుచుకున్నప్పుడు కూడా లీగ్‌ దశలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల చేతిలో ఓటమి పాలయ్యాము అయినా అన్ని విజయాలే కవాలంటే అది గేమ్‌ ఎలా అవుతుంది. నెక్స్‌ మ్యాచ్‌కు ఇంకా బాగా ప్రిపేర్‌ కావాలని ఆశిస్తూ ఆల్‌ ది బెస్ట్‌ ఇండియా...!
సుందర్

No comments:

Post a Comment