ఈ రోజు మా కాలేజ్ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ నరేష్ ఒక మాంచి టాఫిక్ తీసుకొచ్చాడు. అరే రోజులు గడుస్తున్నా కొద్దీ ఎఫెక్షన్ తగ్గుతుంది కదరా.. అని కానీ నేను దానికి కాదు రా బాబు పెరుగుతుంది తప్ప తగ్గదు.. అని... కాదు తగ్గుతుంది అని వాడు.. చాలా సేపు ఆర్గ్యుమెంట్ తర్వాత అరే ఒక అర్థగంటలో ఇంటర్నల్ ఎక్జాము ఉంది. అందరూ చదువుకుంటుంటే... ఇదేం చర్చరా బాబు.. అనుకుంటూనే.. అది తేలే వరకూ.. డిస్కస్ చేస్తూనే ఉన్నాం... చూడు భై నీ మీద అయితే ఇంకా ఎన్ని రోజులైనా... ఒపీనియన్ మారదు... అన్నా... వాడు.... నేనూ... నీమీద ఎప్పుడో ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాను రా అని వాడు.. అయితే మరి ఎఫెక్షన్ ఎక్కడ తగ్గింది అని నేనన్నాను. ఇదంతా కాదు కానీ ఎక్జావమ్ తర్వాత చూసుకుందాం.. అని ఎక్జావమ్‌కు వెళ్లాం... ఈ విషయం నేను నా బ్లాగులో రాసి బ్లాగు మిత్రులతో పంచుకుంటాను ఎలాంటి... రెస్పాన్స్ వస్తుందో చూస్తా... అని వాడితో చెప్పా మరి మీ ఒపీనియన్ ఏంటి...
రోజులు పెరుగుతున్నా కొద్ది ఫ్రెండ్‌షిఫ్ ఎఫెక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా...?
సుందర్
రోజులు పెరుగుతున్నా కొద్ది ఫ్రెండ్‌షిఫ్ ఎఫెక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా...?
సుందర్
అది మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాల కొనసాగింపు పై అధారపడి ఉంటుంది. అంటే, కాలేజీ అయిపోయాకా ఇద్దరూ చెరో వైపుకీ వెళ్ళిపోయి మళ్ళీ కలవడం జరగలేదనుకోండి, ఇక మీ స్నేహం దాదాపు క్షీణించినట్టే. ఇలా ఎందుకంటే మన వయస్సు మారుతున్నకొద్దీ మన లైఫ్ లో ఫోకస్ కూడా మారుతూంటుంది. అంతేకానీ, చిన్ననాటి స్నేహితులు బాగా పెద్దయ్యాకా కనిపించగానే ఏదో సినిమాలో చూపించినట్టు ఉండదు. ఆ స్నేహాన్ని పునరుద్ధరించాలంటే మీ ఇద్దరి మారిన మనస్తత్వాలూ, పరిస్తితులూ కలవాలి. కాబట్టి మీ ప్రస్నకి నా సమాధానం మొదటి వాక్యంలో ఉంది.
ReplyDelete