వీడికేసమస్య వచ్చిపడిందబ్బా.. అందరి అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలను అర్థం చేసుకోవడం కష్టం అంటున్నాడు.. అనుకుంటున్నారా... కష్టం ఏం రాలేదు కానీ ఒక సంఘనట ఆదారంగా ఒక వ్యక్తిని అంచనా వేయలేం అని అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. విషయం ఏమిటంటే... నా కాలేజ్ (పిజి) స్టార్టింగ్‌లో ఏవో సర్టిఫికేట్లు సబ్‌మిట్ చేస్తున్నాము.. అప్పుడు ఒక అమ్మాయి తన సర్టిఫికెట్లు తను సబ్‌మిట్ చేయకుండా.. తను పక్కనే ఉండి పక్క అమ్మాయితో సబ్‌మిట్ చేయిస్తుంది... అప్పుడు అనుకున్నా.... అరే ఈవిడ గారికి ఇంత (ఇగో) అవసరమా... అనీ..
ఇక అప్పుడప్పుడు తను క్లాస్ లో కనిపించడం తను ఏం చేసినా నెగిటివ్ గానే అనిపించేది.
అప్పటినుండి ఒక సంఘటన ఆదారంగా మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు అని తెలుసుకుని తనకు మనసులోనే సారీ చెప్పుకున్నాను...
సుందర్
ఇక అప్పుడప్పుడు తను క్లాస్ లో కనిపించడం తను ఏం చేసినా నెగిటివ్ గానే అనిపించేది.
ఇక ఫస్ట్ ఇంటర్నల్ పరీక్షలు రానే వచ్చాయి. మనమేమో క్లాసెస్ కి వెళ్ళింది చాలా తక్కువ. అంతకు ముందు రోజు ఫస్ట్ ఇంటర్నల్ మెటీరియల్ ఇచ్చారంట. మనమేమో వెళ్ళలేదు. నెక్స్ట్ డే ఇంటర్నల్స్ కావడంతో అబ్బాయిల్లో చాలా మంది క్లాస్ కి రాలేదు. వచ్చినా మన లాంటి బంక్ బాబులే వచ్చారు. ఇక ఎవ్వరినడగాలా అని ఆలోచిస్తుంటే. ఆ అమ్మాయి దగ్గర మేడం ఇచ్చిన మెటీరియల్ ఉందిరా అని చెప్పాడు ఒకడు. వెళ్లి అడుగుదామా అంటే ఎలా రియాక్ట్ అవుతుందో..?? ఒక వేల లేదు అంటే...??? ఉంచుకుని కూడా ఇవ్వను అంటే.??? ఇజ్జత్ కి కసం... అని మా జాన్జిగిరి దోస్త్ నరేష్ ని వెళ్లి తీసుకురమ్మని పంపాను. వాడు కొంచెం జాదుగర్ లెండి .... వెళ్లి అడిగాడు అడగ్గానే మెటీరియల్ బ్యాగ్ లోంచి తీసి ఇచ్చింది. రైటింగ్ సరిగ్గా అర్ధం అవ్వట్లేదు. రాస్తుంటే చాలా వర్డ్స్ అర్ధం అవ్వట్లేదు. అడిగితే ఏమనుకుంటుందో అని నాకు అర్దమైనంత వరకు రాసుకుంటూ వెళ్తున్నా.. మా వాడు ఊరుకుంటాడా..?? ఇదేంటి... ఇదేంటి... అని ప్రతి సెంటెన్స్ లో రెండు మూడు సార్లు అడుగుతున్నాడు. ఇలాగైతే మాతోటి కాదని అర్ధం చేసుకున్న ఆ అమ్మాయే టైం తీసుకుని మరీ సెంటెన్స్ సెంటెన్స్ స్పెల్లింగ్ తో సహా చెబుతూ.. మొత్తం ఒక అర్దగంట టైం తీసుకుని చాలా ఓపికగా చెప్పింది. ఇంతకు ముందు ఆ అమ్మాయితో మాట్లాడింది లేదు.. కనీసం పలకరించింది లేదు. అయినా ఇంత మంచి హెల్ప్ చేసినందుకు థాంక్స్ చప్పి ఎంచక్కా రూమ్ కి వెళ్ళాము.. ఆ అమ్మాయి పుణ్యాన ఎక్షామ్ చేలా బాగా రాసాము.
అప్పటినుండి ఒక సంఘటన ఆదారంగా మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు అని తెలుసుకుని తనకు మనసులోనే సారీ చెప్పుకున్నాను...
No comments:
Post a Comment