అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, March 25, 2011

దెబ్బకు దెబ్బ...


టీమిండియాకు 2003 ప్రంపంచ కప్‌ ఫైనల్లో జరిగిన పరాభవానికి 24 న  జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆసీస్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. చేతికాడికి వచ్చిన కప్‌ను ఎగురేసికెళ్లి రంకెలేసిన  కంగారూలకు గర్వభంగం అయ్యేలా దోని సేన విజయం సాధించింది. ఆరోజుమాదిరిగానే ఈరోజు కూడా పాంటింగ్‌ సెంచరీ సాధించినప్పటికీ.. భారత బౌలర్ల్లు కట్టుదిట్టమైన లైనప్‌తో తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. 
తదనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత బృంధం ఐదు వికెట్లు కోల్పోయి  రెండు ఓవర్లు మిగిలుండగానే విజయదుందుబి మోగించారు. సచిన్‌, గంబీర్‌, యువీ,లు అర్థ సెంచరీలతో విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌లో యూసుఫ్‌ బదులు బరిలోకి దిగిన రైనా కూడా యువితో జతకట్టి విజయ సాధనలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక పాక్‌తో 30వ తేదీన జరగనున్న సెమీస్‌లో కూడా సమిష్టిగా రాణించి ప్రపంచకప్‌ ఫైనల్‌పోరుకు సిద్దమవ్వాలని కోరుకుంటూ..

సుందర్

1 comment: