'ధోని సిక్సర్ బాదాడు..... భారత దేశంమొత్త కేరింతలతో నిండిపోయింది. యువీ ఉద్వేగంతో ధోనిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అంతే ఉద్వేగంతో ధోని కళ్లలోంచి కూడా.. నీళ్ళు పెడేళ్‌మని వచ్చేసాయి.... డ్రెస్సింగ్ రూమ్ నుంచి కొండంత ఆనందాన్ని నింపుకుని వచ్చిన సచిన్ కళ్లు కూడా చెమ్మగిళ్లాయి. యువీని.... ధోనిని గట్టిగా పట్టుకుని మాస్టారు కూడా... ఒక పెట్టున.. కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు... మన భజ్జీ మాత్రం దేన్ని ఆపుకోలేడంటాం.. అలాగే మైదానంలో అందరికంటే ఎక్కువగా కన్నీళ్లు పెడుతూ.. ఒక్కొక్కరుగా వీరు... గంభీర్,రైౖనా... ఫటాన్..... కోహ్లీ.. అబ్బబ్బబ్బ్బబ్బ... నా కళ్లలోకి నీళ్ళు దుమికాయి....
అంతే.. పట్టలేని ఆనందంతో....నేను కేరింతలు కొడుతూ... బయటకు వెళ్లిపోయాను.... మళ్లీ వచ్చే సరికి సచిన్ సహచరులు భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్‌లో ఊరేగడం... ఆ దృశ్యాన్ని మిస్సయ్యాను..... చాలా సేపు టీవి చానళ్లలో వెతికాని ఎంతకూ కనిపించలేదు నెట్ ఓపెన్ చేసి ఫోటోలు చూసి ఈ పోస్టు రాస్తున్నాను....
సుందర్
మా స్నేహితుణ్ణి భాగ్యనగరం కేర్ ఆసుపత్రికి చెకప్ తీసుకెళ్ళడం వల్ల ఆటను చూడలేకపోయాను.దురదృష్టవంతుణ్ణి,అయితేనేం కప్పు గెలిచిన అదృష్టవంతులం కదా!
ReplyDelete