అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, May 31, 2011

అర్థరాత్రి ఐస్‌క్రీం బండివాడి అవస్తలు....!

అర్థరాత్రి 12 గంటలకు చల్లగాలిలో... వర్షం పడుతుంటే..... ఐస్‌క్రీం తింటే.... అబ్బో... ఇదేదో సినిమా డైలాగ్‌లాగుంది కదా... నిజంగా చాలా బాగుంటుంది... ఎందుకంటే... నేనూ.. నా ఫ్రెండ్స్‌తో చాలా సార్లు తిన్నాను...  రాత్రి 11 గంటల తర్వాత మా ఆఫీసు  పక్కనే ఉన్న VST కి వెళ్లి డైలీ ఐస్క్రీం లాగిస్తుంటాం. ఆ ఐస్‌క్రీం ఆ టైమ్‌లో తినడమంటే... తినేవాళ్లకు చాల సరదాగా ఉంటుంది. కానీ.. ఐస్‌క్రీం బండి వాడికి చిరుగుతుంది... ఎందుకంటారా.... ఎక్కడినుండి పోలీస్‌ వ్యాన్‌ వస్తుందో.. ఒకవేల వస్తే ఎక్కడ దాక్కోవాలో... అంటూ... టెన్షన్‌ టెన్షన్‌గా ఉంటాడు.. ఎందుకంటే ఇది సినిమా కాదు కదండీ ఎప్పుడు పడితే అప్పుడు ఐస్‌క్రీం అమ్ముకోవడానికి. రాత్రి 11 దాటితే అమ్మకూడదు అని రూల్ ... కానీ అప్పుడే మనోడికి చాలా మంచి గిరాకీ ఉంటుంది. కాబట్టి ఎన్నో కష్టాలు పడుతూ ఆ రెండు గంటలూ.... ఐస్‌క్రీం అమ్ముతుంటే... క్షణక్షణ గండం... రెండు గంటల గిరాకీ అన్నట్లుంటుంది. ఒక వేళ కర్మగాలి పోలీస్‌ వాళ్లకు దొరకాలీ.. వాడికి దూలతీరినట్టే ఐస్‌క్రీంలు బొక్క.... మీదంగ రెండు మూడు బూతులు... చూసేవాళ్లకు వీడికి ఈ టైంలో ఇంత రిస్క్‌ వసరమా అనిపిస్తుంది కానీ.. అదే వాడి జీవనాదారం... ఈ ఐస్‌క్రీం బండి నడపకపోతే... బ్రతుకుబండి నడవదు కదా.....
సుందర్

No comments:

Post a Comment