అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, May 31, 2011

లాస్ట్‌ ఇయర్‌ ఇదే రోజును (31.5.10) నా లైఫ్‌లో మర్చిపోలేను...

ఆరోజు 31.05.2010 మాఊళ్లో.. యాదన్న (ఈనాడు సబ్‌ఎడిటర్‌) రిసెప్షన్ నేను ముందు రోజు పెళ్లికి వెళ్లలేదు. కాబట్టి ఎలాగైనా రిసెప్షన్‌కు వెళ్లాలని ఆఫీసులో ఫస్ట్‌ టైం మార్నింగ్‌ డ్యూటీ చేసాను. అంతకు ముందు రోజు సార్‌ను మార్నింగ్‌ డ్యూటీ చేస్తా సార్‌ అని అడిగాను కానీ నువ్వు కొత్తగా డ్యూటీలో చేరావు. కాబట్టి నువ్వు మార్నింగ్‌ రాకూడదు.. ఆ వర్క్‌ ఫర్‌ఫెక్టు అయ్యాక వద్దువుగానీ అన్నాడు.. కానీ ఆరోజు ఎందుకో నైట్‌నుండి ఆఫీసులోనే ఉన్నా.. ఈవినింగ్‌ వరకూ వెబ్‌సైట్‌లో లప్‌లోడింగ్‌ చేసా... అంతా బాగానే ఉంది కాని  మద్యలో   సార్‌ ఫోన్‌ చేసాడు ఏదో ఇన్షర్మేషస్‌ అడిగాడు. చెప్పగానే ఫోన్‌ పెట్టేసి మళ్లీ ఫోన్‌ చేసి నిన్ను మార్నింగ్‌ డ్యూటీకి రావద్దని చెప్పాను కదా అన్నాడు.. నేనన్నాను నేను రూంకి వెల్లలేదు సార్‌ కాబట్టి ఊరికే ఉండి ఏం చేద్దాం అని అప్‌డేట్స్‌ అప్‌లోడ్‌ చేసాను మళ్లీ ఈవినింగ్‌ కూడా చేస్తా అన్నా.. ( నేను మార్నింగ్‌ చేసిందే... ఈవినింగ్‌ ఊరికి వెళ్లడానికి) సార్‌ కొద్దిసేపు ఆలోచించి డ్యూటీలో మిగతా ఇద్దరు ఉన్నారా అన్నాడు.. అప్పుడు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.. వెంటనే బయలు దేరాను ఇబ్రహింపట్నంలో మా ఫ్రెండ్స్‌ కలిసారు.. కానీ నాకు తెలియకుండా... దూరం దూరం ఉంటున్నారు ఎందుకబ్బా అనుకున్నా.... బస్‌ దిగి డైరెక్టుగా రిసెప్షన్‌ దగ్గరికి వెళ్లాను అందరూ... చాలా స్పెషల్‌గా రిసీవ్‌ చేసుకుంటున్నారు.. చాలా కొత్తగా అనిపించింది. ఎందుకబ్బా అనుకున్నా... ఒక  ఫ్రెండ్‌ వచ్చి హ్యాపీ బర్త్‌డే హీరో
అన్నాడు..రేపు కదా నా బర్త్‌డే అనుకున్నా... థాంక్స్‌ చెప్పి.. స్టేజీ వద్దకు వెళ్లాను చాలా మంది డ్యాన్స్‌ చేద్దామనుకుంటున్నారు కానీ ఎవ్వరు ముందు చేస్తారా అని చూస్తున్నారు.. అప్పుడే కొత్త సాంగ్‌ ఒకటి వేయించి నేను "బెంగాల్"‌ (మా తమ్ముడు) గాడు ఒక ఊపు ఊపాం.. ఇంకేముంది అప్పటినుండి 12 గంటలవకూ ఒకటే డ్యాన్సులు. ఫంక్షన్‌ అయిపోయే సరికి 1.30 దాటింది.. పద అన్నా ఇంటికి వెళ్దాం అన్నారు. నవీన్‌ (మా ఫ్రెండ్‌) వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడుతూ కూర్చున్నాము.. అప్పుడు మా నారి గాడు (తమ్ముడు)  వచ్చి అన్నా అన్నా.. శ్రీశైలం, క్రిష్ణన్న కొట్లాడతుండ్రు.. నువ్వు తొందర రా అన్నా అని కమిటీ హాల్‌ వద్దకు తీసుకెళ్లాడు.. వెళ్లాను కమిటీ హాల్‌ తలుపు మూసి ఉన్నాయి.. తలుపు కొట్టగానే తీసారు క్యాండిల్‌ లైట్స్‌ వెలుగుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే సుందర్‌ అనే షేప్‌లో... పక్కనే కేక్‌... చాలా ఎక్సైట్‌ అయ్యాను అసలు నేను ఇంటికి వస్తానో రానో అని డిసైడ్‌ అయ్యిందే.. 7.30కి ఎప్పుడు కేక్‌ తెచ్చారో అనుకున్నా కానీ ఇబ్రహింపట్నంలో కలిసిన మా ఫ్రెండ్సే కేక్‌ తీసుకుని నాకు కనిపించకుండా దాచారు.. కేక్‌ కట్‌చేసి అందరికి తినిపిస్తూ చాలా ఫోటోలు దిగాము... అందరు చాలా ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పారు..   చాలా గిఫ్ట్‌లు  ఇచ్చారు.. ఆ తర్వాత కూల్‌డ్రింక్స్‌ తాగుతూ అందరితో చాలాసేపు మాట్లాడి.. 3 గంటలకు ఇంటికి వెళ్లి పడుకున్నా.. అంతటి ఎంజాయ్  ఈ రోజు మిస్సయ్యానా అనిపింస్తోంది కదా.. కానే కాదు.. రేపు (1.6.11)కి ఊరెళ్తున్నా... రోజంతా  ఫుల్‌గా ఎంజాయ్ చేసి మళ్లీ వచ్చి ఆ విశేషాలు మీతో పంచుకుంటా... ఉంటా మరి....
సుందర్

1 comment: