అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, June 7, 2011

నా నిద్ర మత్తు...!!!!!

 నైటంతా నిద్ర లేదు.. ఎక్సామ్‌ గురించి నిద్ర పోకుండా కుస్తీ పడి.. ఒక గంట నిద్రపోయా 5.30 నుండి 6.15 వరకూ..... తర్వాత ఫ్రెష్‌ అప్‌ అయి ఎక్సామ్‌ సెంటర్‌ వెళ్లి ఎక్సామ్‌ పూర్తయ్యే సరికి 1 అయింది. ఇక రూంకెళ్ళి పడుకుందాం అంటే... మాబెంగాల్‌ గాడు ( మా తమ్ముడు  బెంగాల్ టైగర్ గంగూలి వాడి నిక్ నేమ్ కాబట్టి ముద్దుగా బెంగాల్ అని పిల్చుకుంటాము) ఫోన్‌ చేసి అన్నా నేను సిటీ వస్తున్నా.. షాపింగ్‌ చేద్ధాం మాంచి డ్రెస్‌ తీసుకోవాలి అన్నాడు. ఇంకేముంది. రెండు గంటలనుంచి సాయంత్రం 5 గంటలదాకా షాపింగ్‌ చేసి ఈవినింగ్‌ చాదర్‌ఘాట్‌లో బిర్యాని తిని మా తమ్మున్ని ఇంటికి పంపించి నేను ఆఫీసుకు బయలుదేరాను.. టైం 6 అవుతోంది. డ్యూటీ ఏడుగంటలకు కాబట్టి ఇంత ముందు వెళ్లి ఏం చేద్ధాం అనుకుంటూ.. సుందరయ్య పార్క్‌ (బాగ్‌లింగంపల్లిలో) కూర్చున్నా... పిల్లలంతా సందడి సందడిగా ఆడుకుంటున్నారు. పెద్దలు, ముసలి వాళ్లువాకింగ్‌ చేస్తున్నారు. షటిల్‌ ఆడుతున్నారు .. చాలా సందడిగా సరదాగా ఉంది. కొద్దిసేపు ఫ్రెండ్‌తో చాటింగ్‌ చేసి మరో ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి ఫోన్‌ చేతిలోనే పట్టుకుని  పార్క్‌లో నడుంవాల్చా... నైటంతా నిద్రలేనందుకో... లేక పొద్దంతా బాగా షాపింగ్‌ కొరకు కాచిగూడ నుండి చిక్కడపల్లి వరకూ.. చక్కర్లు కొట్టినందుకో గానీ అలసిపోయిన నాకు ఎప్పుడో నిద్ర పట్టేసింది. 

అప్పుడే..... చాలా గోలగోలగా వినిపిస్తోంది. ఏంటబ్బా ఈ లొల్లి అనుకుంటూ లేచి చూసాను సెల్‌ పక్కనే పడుంది. టైం చూస్తే ఎనిమిది అవుతోంది. విశేషం ఏంటంటే... టైం ఎనిమిది అవడంతో అందరూ ఇళ్లకు వెళ్తున్నారు. అందుకే అంత  లొల్లి... ఇక దిమ్మదిరిగినంత పనైంది. అరే ఏడుగంటలకు డ్యూటీ... నాకు ఇప్పుడెందుకు నిద్రపట్టిందో ...... అయ్యో అనుకుంటూ.... ఆపీసుకు పరుగులు పెట్టా ఆఫీసంతా ప్రశాంతంగా ఉంది. టైం ఎనిమిది అవుతోంది.. ఎవరి వర్కులో వారున్నారు.
చాయ్  అబ్బాయ్ వచ్చి  అన్నా చాయ్ అన్నాడు.. వేడి వేడి  చాయ్ తాగుతూ  జరిగిన విషయం మొత్తం చెబుతుంటే.. ఫ్రెండ్స్‌ ఒకటే నవ్వు. నా నిద్ర మత్తు మాత్రం వదల్లేదు. కానీ చేయాల్సిన వర్క్  మాత్రం చాలా ఉంది. తొదరగా కంప్లీట్‌ చేసుకుని పడుకోవాలి... మళ్లీ  ఎల్లుండే బిసినెస్‌ ఎకానమిక్స్‌ ఎక్జాం  మళ్లీ  ఎలాగూ రేపంతా కుస్తీ తప్పదు కదా...
సుందర్

No comments:

Post a Comment