అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, August 5, 2011

రైతన్నా నీ కరెంటు బాధ.... ఎన్నటికీ అది ఒడవని గాధ....!

ఎడతెరపే లేని కష్టం నీదీ
ఎవరెరుగని ఎడారి గోసే నీదీ..
జగతికి అన్నం పెట్టే వాడా...
నీ కునుకుకు లేనే లేదా జాడా...
నడిజామున ఉలిక్కి పడి లేచేవు
నిషిరేయిలో బావికి పరిగెత్తేవు..
ఆ చీకటి దారిలో ముళ్ళకు తెలుసా...?
నీపాదంలో ఇక చోటేలేదని...
పారాడే ఆ పాములకెరుకా....?
విషమించిన నీజీవిత నడక
తేలిన కరెంటు తీగలకెరుకా...?
తేలని నీ కుటుంబ బారపు నౌకా...
రోజూ సాగే ఈ చట్రంలో
ఎప్పుడోచిక్కీ బలియైపోతే
నీ మరణం ఒక పేపరు వార్త...
రైతన్నా నీ కరెంటు బాధ
ఎన్నటికీ అది ఒడవని గాధ....
సుందర్

No comments:

Post a Comment