అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, September 4, 2011

మరువా... మరువా... మీ సేవ నే మరువ.....!

గురువా నా బ్రతుకుకు ఆదరువా...
భవితకు... ప్రగతికి బాటవు నీవా....
ప్రాణమిచ్చే బ్రహ్మయ్య
జన్మనిచ్చే నా తల్లి
జ్ఞానమే నీవయి వెలుగు నింపావు....
జగతికి ఆదారం, ప్రగతికి మూలం...
గెలుపూ... వెలుగూ... అన్నీ నీవే నీవే
గురువా నా బ్రతుకుకు ఆదరువా.. గురువా.. గురువా.....
అ అంటే అమ్మరా
ఆ అంటే ఆవురా
ఇ అంటే ఇల్లురా
ఈ అంటే ఈగరా
అఆల అర్థాన్ని ఆదిలోనే తెలిపావు
జీవితసారాన్ని రంగరించి నేర్పావు...

వెలకట్టలేని విద్యనాకిచ్చారు
ఏమిచ్చి తీర్చుకోను మీ యొక్క రుణమును
పాదాభివందనం మీకేచేస్తున్నా....
ప్రాణమున్నంత వరకూ...
మరువా... మరువా...
మీ సేవ నే మరువా.....
సుందర్

No comments:

Post a Comment