మాది ఒక చిన్న గ్రామం అక్కడ సుమారు 150 ఇళ్లు ఉంటాయి. నాకు తెలివి వచ్చినప్పటినుండి రెండు వినాయకుళ్లను నిలబెట్టే వాళ్లము. ఒకటి మాది మరోటి వేరేవాళ్లది డెకరేషన్, దగ్గరనుండి భజన వరకూ అంతా పోటాపోటీగా జరిగేది. కోలాటం, భజన (అంటే ఒక్కో భక్తి పాట చెబుతుంటే ఒక్కో లయ ప్రకారం అడుగులు వేయడం.. ) రాత్రి 12 గంటలదాకా ఒకటే సందడి చేసేవాళ్లం. ప్రేక్షకులు కూడా అప్పటివరకూ తీరికగా కూర్చుని చూసి ప్రసాదం తీసుకుని వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఆ కళ లేదు. భజన చెప్పే పంతుళ్లు లేరు. ఇంక కోలాటం మాటేలేదు. నేను ఇంతకుముందు చెప్పింది ఎప్పుడో చిన్నప్పటిగురించి కాదు ఒక రెండు సంవత్సరాల కిందటి సంగతి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఉన్న చిన్నగ్రామంలో వీదివిదికీ కుల సంఘాలు వెలసాయి. తలా ఒక వినాయకున్ని ప్రతిష్టించారు. అంతా కళావిహీనంగా అయ్యింది. కలలు కనుమరుగవుతున్నాయంటే.. విన్నాను ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను.
సుందర్
సుందర్
No comments:
Post a Comment