అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, October 11, 2011

ఎన్నాళ్లీ ముసుగులో గుద్దులాట....?

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముసుగులో గుద్దులాటలాడకుండా.. స్ఫష్టమైన వైఖరిని తెలపాలి తెలంగాణా....? వస్తుందా....? వస్తే ఎప్పటికి వస్తుంది....? ఇంత నాటకాలు ఆడవలిసిన పని ఏంటి...? నాలుగు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే, 600 మంది అమాయకుల ఆత్మలు గాలిలో కలిసిపోతే... డిల్లీలో ఎసీ రూంలలో కూర్చుని మంతనాలు జరుపుకుంటూ.. ఎన్ని రోజులు నాన్చుతారు...? వారి స్వార్థరాజకీయాలు తప్ప ప్రజల గోడు ఎవరికి వినపడుతుంది. గత నెల రోజులుగా తెలంగాణా ప్రాంతంలో పరిపాలన స్తంభించిపోయింది. బస్సులు నడవట్లేదు... ప్రయివేటు వాహనదారుల విపరీతమైన ఛార్జీలు.. కరెంటు కోతలలతో... సామాన్యుడి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. తెలంగాణాలో ఉద్యమం నడుస్తోంది. అందులో ఎంత నష్టం వచ్చినా అది మళ్లీ ప్రజలపైనే పన్నుల రూపంలో వేస్తాం.. అని చెపుతున్నారే... తప్ప వారు కోరేదాంట్లో ఎంత వరకు నిజం ఉంది.... దానికి ఎలా స్పందిచాలి... పరిస్థితిని ఎంత త్వరగా చక్కదిద్దాలి అని చూడకుండా.. అసందర్భ ప్రకటనలు చేయడం కరెక్టు కాదు. తెలంగాణా ఇద్దామా ఇస్తే కాంగ్రెస్‌కు ఎంత లాభం...? ఎంత నష్టం...? టిఆర్‌ఎస్‌ ఇతర రాజకీయ పక్షాలు ఎంత బలపడుతాయి.... ఆధ్ర, రాయలసీమ ప్రాంతాలనుండి ఎంత వ్యతిరేకత వస్తుంది. అని లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే రోజురోజుకు సమస్య ఇంకా జఠిలం అవుతుంది. ఒక్క నిమిషం స్వార్థాన్ని పక్కన పెట్టి  సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి.
సుందర్

1 comment:

  1. మీరనుకొంటున్నట్టు వాళ్ళు నిజంగా ఆలోచిస్తారా?

    ReplyDelete