పొద్దున్నే..
తన చేత జారిన ముగ్గు సుక్కా
ఎందుకంతలా మెలికల్ తిరుగుతావ్
చక్కని సుక్కని వీడలేకా చెమట సుక్కా..
గాబరాగాబరాగా జారిపడతావ్....
నడుము వంపును హత్తుకున్న సత్తు బిందే..
వేడి హాయిలో.. తొనికిపోయి ఒలికిపోతావ్
సందెవేల కొంగు తడిమి కొంటె గాలి ...
సింగారంలో తూలిపోతూ ఊగిపోతావ్...
మాపటేల నిద్రపుచ్చే పట్టె మంచమా...
పట్టలేని సంతోషంతో పులకించిపోతావ్..
తన ఓరచూపు తాకగానే చిన్ని ప్రాణమా...
ఓపలేక ఊహల్లో ఎగిరిపోతావ్....
సుందర్
తన చేత జారిన ముగ్గు సుక్కా
ఎందుకంతలా మెలికల్ తిరుగుతావ్
చక్కని సుక్కని వీడలేకా చెమట సుక్కా..
గాబరాగాబరాగా జారిపడతావ్....
నడుము వంపును హత్తుకున్న సత్తు బిందే..
వేడి హాయిలో.. తొనికిపోయి ఒలికిపోతావ్
సందెవేల కొంగు తడిమి కొంటె గాలి ...
సింగారంలో తూలిపోతూ ఊగిపోతావ్...
మాపటేల నిద్రపుచ్చే పట్టె మంచమా...
పట్టలేని సంతోషంతో పులకించిపోతావ్..
తన ఓరచూపు తాకగానే చిన్ని ప్రాణమా...
ఓపలేక ఊహల్లో ఎగిరిపోతావ్....
సుందర్
No comments:
Post a Comment