అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, February 18, 2013

నా క్రికెట్‌ పిచ్చికి ఒకలెక్క దొరికింది..!!!

ప్రజాశక్తి 32వ వార్షికోత్సవ క్రీడల్లో క్రికెట్‌ టోర్నీ. అందులో 11 జట్లు పాల్గొన్నాయి. అందులో మేము'సుందరయ్య` టీం పేరుతో ఎడిటోరియల్ బోర్డు తరపున బరిలోకి దిగాము. జట్టు కూర్పుకై నిద్రలు మాని ప్లాన్లు గీసామ,ప్రాక్టీసులుచేశాము. గెలవాలి అనే ఒకే ఒక పట్టుదలతో మైదానంలోకి  దిగాము.
మొదటి మ్యాచ్ నుండి ... మా జట్టు సమిష్టి విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్‌ గెలిస్తే కప్‌ ఎగరేసుకుపోవచ్చు....
గంపెడన్ని ఆశలు..పుట్టెడన్ని ప్లాన్లతో గ్రౌండ్‌లోకి దిగాం... మా ప్రత్యర్థి  టోర్నీ ఫెవరెట్‌గా చెప్పుకుంటున్న ఎచ్‌ఆర్‌ టీం, వాళ్ళ ఇన్నింగ్స్ స్టార్టింగ్‌ చూస్తేఎక్కడ 100 పరుగులు దాటుతుందో అనుకున్నాం. ఏమైతేనేం చివరికి 12 ఓవర్లలో 76పరుగులకే కట్టడిచేశాం.
మా ఫ్రెండ్‌ శ్రీకాంత్‌తో పాటూ.. బ్యాట్‌ చేతపట్టుకుని ఓపెనర్‌గా క్రీజులో అడుపెట్టాను...టపాటప్‌ టపాటప్‌ మా టాప్‌ ఆర్డర్‌ మొత్తం కుప్పకూలిపోయింది. మరో ఎండ్‌లో నేను అలా చూస్తూ నిల్చున్నాను...అప్పటికి మూడు ఓవర్లలో 15 పరుగులు.. మొత్తంలో నాలుగు కీలకవికెట్లు డమాల్... ఏం చేయాలో తెలియని టెన్షన్లో లెగ్ వికెట్ మీదుగా రెండు సిక్సర్లు నా బ్యాటునుండి జాలు వారాయి. అప్పుడే డిసైడయ్యా నేను క్రీజులో ఉంటే మ్యాచ్‌ గెల్చుకోవచ్చని. ఒకవైపు మా టీంను ఒత్తిడిలోకి నెట్టే ప్లాన్లు చాలా చేస్తున్నారు మా ప్రత్యర్థి  జట్టు సభ్యులు.
నేను మాత్రం ఒకే మంత్రం ''కూల్‌ కూల్‌'' అంటున్నా.. నా పార్టనర్స్ తో కూల్ మా టీం మంత్రమైంది. అంత టెన్షన్లో కూడా కూల్ కూల్ అంటుంటే ఎదుటి టీం కి చిర్రెత్తుకొస్తోంది.

ఒక వైపు  బాల్స్ తగ్గిపోతున్నాయ్... మరోవైపు రన్‌ రేట్‌ పెరిగిపోతోంది. వికెట్లు పడిపోతున్నాయ్..   అప్పుడు మాకూ టెన్షన్...మొదలైంది.
మధ్య మధ్యలో చెత్త బంతుల్ని  బౌండరీ అవతలికి పంపిస్తున్నాను.  దాంతో మళ్లీ రన్‌ రేట్‌ కంట్రోల్‌ అవుతోంది.
"శ్రీను బ్యాట్‌ పైకెత్తరా..." అంటూ..  గ్రౌండ్‌ అవతలి నుండి  అరుపులు వినిపిస్తున్నయ్...  తిరిగి చూస్తే... మా ఫ్రెండ్ శ్రీకాంత్  మళ్ళీ కేకేశాడు. ... .నీది  ఫిఫ్టీ అయిందిరా బ్యాట్ పైకెత్తు అంటూ  మాఫ్రెండ్‌ ఆనందంతో..... గెంతులేస్తున్నాడు.... .  నా మనసులో చెప్పలేని ఆనందం ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం హాప్ 'సెంచరీ. సరే పోయిందేముంది  ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో .... అనుకుంటూ  బ్యాటి పైకెత్తి ... సచిన్ లెవెల్లొ..(సచినే కదా మన ఫేవరేట్ హీరో సో కొన్ని కొన్ని అలా ఫాలో అవ్వాలి మరి) సూర్యున్ని చూసాను..
మనసులో ఒకటే జపం చేస్తున్నా...   మ్యాచ్‌ గెలవాలి........ మ్యాచ్‌ గెలవాలి.......అనుకుంటూ..
 18 బంతుల్లో 15 రన్స్‌కావాలి ఏముందిలే సింపుల్ గా కొట్టెయ్యొచ్చు అని మా  టీం వాళ్ళు దీమాతో ఉన్నారు....    ఆ ఓవర్‌ చాలా టైట్‌గా వేశారు. కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. అందులో రెండు వికెట్లు కూడానేల కూలాయి.   ఇంకా 12 బంతుల్లో 11 పరుగులు చేయాలి. అప్పుడు మళ్ళీ  టెన్షన్.. టెన్షన్..
స్ట్రైకర్ ఎండ్ లో ...  నేనున్నాను  మొదటి బంతికి రెండు పరుగులొచ్చాయి. రెండో  బంతి లెగ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌.. మా జట్టు వాళ్లు సంబరాల్లో మునిగారు టార్గెట్‌కు దగ్గరగా వచ్చాం. తర్వాతి బంతి డాట్‌.... మళ్లీ తర్వాతి బంతీ డాట్‌..... మళ్లీ టెన్షన్‌ ఏమౌతుందా అనీ... తర్వాతి బంతి స్క్వేర్‌లెగ్‌లో మరో సిక్సర్‌.
ఇంకేముంది ఫైనల్‌ కొట్టాము. మొదటి సారి నా కెరీర్‌లో ఆఫ్‌ సెంచరీ.. 32 బంతుల్లో 7 సిక్సర్లు రెండు ఫోర్లతో 63 నాటౌట్‌..
వీ ఆర్‌ ది ఛాంఫియన్స్.... ప్రపంచకప్‌ గెలిచినంత సంబరం... గ్రౌండంతా గోళగోళచేశాము. ఆ ఆనంద క్షణాలు.. ఎప్పటికీ మరిచిపోలేనివి.... అందునా ఆ కప్‌ భాహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త చుక్కారామయ్యగారి చేతుల మీదుగా తీసుకోవడం. ఇంకా ఆనందన్నిచ్చింది.
పలక పట్టకముందే బ్యాటు పట్టుకు తిరిగిన నా క్రికెట్‌ పిచ్చికి ఒకలెక్క దొరికినట్లయింది..!
సుందర్

No comments:

Post a Comment