అప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది.... అంతలో కొద్దిసేపు వాన కొట్టి
ఆగిపోయింది. అప్పుడు మొదలైంది మరో పరుగుల తుఫాన్. ఆనాడు రేపల్లెపై
ఇంద్రుడు ప్రతాపం చూసిస్తే.. ఈ నాటి మ్యాచ్‌లో పూణే వారియర్స్ పై గేల్
విరుచుకుపడ్డాడు. అరె హ్వా యమ కొట్టుడు కొట్టాడు. అది క్రికెట్
గ్రౌండా... వీడియో గేమ్ స్క్రీనా... 66 బాల్స్, 175 రన్స్... 13 కళ్లు
జిగేల్‌మనే ఫోర్లు, 17 భీభత్సమైన రాకెట్ సిక్సర్లు, కొట్టింది
మనిషేనా...?!!
గుడ్‌లెంత్ బాల్, షార్ట్‌పిచ్, ఫుల్ టాస్, యార్కర్ ఏదైతేనేం బౌండరీ ఆవల ఎత్తేయడానికి. గేల్ బాదుడుకు చిన్నస్వామీ స్టేడియం చాలా చిన్నదైపోయింది. బౌండరీలు సలాంకొట్టి గులాం అన్నాయ్... చుక్కలు రావడానికి టైం పడుతుందనుకున్నాడేమో... ముందే బౌలర్లకు చుక్కలు చూపించాడు. గేల్ బ్యాటు బాదుడును తట్టుకోలేక బంతి అస్తమానం స్టాండ్స్ లో తల దాచుకుంది.. ఒకట్రొండు బంతులు ఇక వేగలేను బాబోయ్ అంటూ... గ్రౌండ్ అవతలికి దూకి పారిపోయాయ్...
క్రీజులోంచి అడుగు కదపడు.... నిల్చున్నోడు నిల్చునే ఉంటాడు.. బ్యాట్ చేతిలో గిర్‌ర్‌న తిరుగుతుంది... బంతి ఆకాశం అంచులనుండి డైరెక్టుగా ప్రేక్షకుల మధ్య ప్రత్యక్షమౌతుంది. ఇంక మోకాలు నేలకానించి ఫైన్‌లెగ్‌లో కొడ్తేనా అంతే సంగతి.
పూణేవారియర్స్‌లో గాబరా పుట్టించి గాంగ్నమ్ ఆడుకున్నాడు. ఆ క్షణంలో బౌలర్ల ఫేసులు చూడాలీ... అగ్ని పర్వతం బద్ధలై లావా ఎగజిమ్ముతుంటే.. ఫైరింజన్‌తో ఆర్పలేమని తెలిసీ... తప్పించుకోలేక.. పారిపోలేక...నిస్సహాయంగా పోరాడుతున్న సిబ్బంధి లెక్క.... ఇబ్బంది పడ్తుంటే.. ఇది ప్రేక్షకులకు మాత్రం రెండు కళ్లూ చాలదనిపించే నిండు దీపావళే... చివర్లో ఇంకొద్దిగా స్ట్రైక్ దొరికుంటే... టి-20లో డబుల్ సెంచరీ చూసేవారిమే...!!!
సుందర్

No comments:
Post a Comment