అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, May 31, 2013

పెద్దల్ని ఒప్పించి...!!

ఈ రోజు ఉదయం మా మిత్రుడి పెళ్లికి వెళ్లాను. వెళ్తూ వెళ్తూనే పెళ్లి కుమారుడి రూమ్‌లోకి వెళ్లి కుశల ప్రశ్నలు అడుగుతున్నా, ఒక వైపు ఫోటో షూట్‌ జరుగుతోంది. మాటల మధ్యలో నాకో విషయం గుర్తొచ్చింది.

మా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో మా ఫ్రెండ్‌ (పెళ్లికొడుకు) ఒక సంఘటన గురించి రెండు లైన్లు ఈ విధంగా నెరేట్‌ చేశాడు.
 ''అరే మామా ఈ రోజు మీ మామీ ( పెళ్లి కూతురు నేను మామి అని పిలుస్తాను) వాళ్ల అన్న వార్నింగ్‌ ఇచ్చాడు రా అన్నాడు".
ఏమైంది కొంచెం క్లియర్‌ గా చెప్పు డార్లింగ్‌ అన్నాన్నేను ఆతృతగా..!
"ఈ రోజు మా బావగాడికి మా లవ్‌ మాటర్‌ తెలిసి పోయింది. నా దగ్గరికి వచ్చి, 'అరే నువ్వు మా చెల్లి జోలికి వస్తే బాగుండదు' అని వార్నింగ్‌ ఇచ్చాడ్రా అన్నాడు".
 మరి నువ్వేమన్నావ్‌ మామా అన్నాన్నేను...???
'నేను మీ చెల్లి వెంటే పడతాను'' ఏం చేసుకుంటావో చేస్కో..'' అని గట్టిగా చెప్పేసాను రా" అన్నాడు కొంచెం స్వరం పెంచుతూ. చివరకు తోసుకున్నాం.. కొట్టుకునేది  ఒక్కటే తక్కువ" అని చావు కబురు చల్లగా చెప్పాడు. 

వీడి బావేమో ఆరడుగుల హైటూ... మాంచి పర్సనాలిటీ.... ఉన్న వ్యక్తి..  వీడేమో ఐదున్నర అడుగులుండి ఒక మోస్తారు బాడీ..
 ఏం చూసుకుని మామా నీకింత ధైర్యం అన్నాన్నేన్నేను. ఏమోరా అలా ఫ్లోలో వచ్చేసింది అన్నాడు.
ఒక వేళ అతను కొడితే ఏం చేసేవాడివి మామా అని అడిగితే 'లైట్‌ రా బామ్మర్థే కదా సర్థుకుపోయేవాణ్ణి అన్నాడు లాజిక్‌ గా..!
ఇది సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
ఇక ఈ రోజు విషయానికి వస్తే మా ఫ్రెండ్‌ మాంచి పెళ్లి దుస్తుల్లో దర్జాగా కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ రోజు కాలర్‌ పట్టుకుని వార్నింగ్‌ ఇచ్చిన మా ఫ్రెండ్‌ గాడి బావ కాళ్లు కడుగుతున్నాడు. అర్రేే... మావా నువ్వు సూపర్‌ రా అనుకున్నా మనసులో...!! ఎందుకంటే ....!!!


కులాలు  కలవలేదు అని  రెండు కుటుంబాల్లో ససేమిరా అని మొండి పట్టుపట్టిన పెద్దల్ని ఒప్పించి, ఈ రోజు ఘనంగా బంధు మిత్రుల సమక్షంలో...  అస్సలు ఒప్పుకోం అన్నవాళ్లతోనే  అక్షింతలు వేయించుకున్నాడు అంటే ఎవరు మాత్రం మెచ్చుకోకుండా ఉంటారు చెప్పండి..!!!

"Happy Married life Darling..."
సుందర్

No comments:

Post a Comment