అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, January 27, 2011

సినీ పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టించనుందా...?

ఒక ప్రయోగం, అనేక కొత్త మలుపులకు నాంది. ఆ ప్రయోగం విఫలమైనా, సఫలమైనా ప్రయోజనమే చేకూరుతుంది. ఒక వేళ విఫలం అయితే మళ్లీ కొత్త ప్రయోగం ఎలా చేయాలో నేర్పుతుంది. అదే సక్సెస్‌ అయితే ఇక దాన్నుంచి వచ్చే ఫలం ప్రయోగ కర్తకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. 

ఇప్పటికే మన సినీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులలో కొట్టుమిట్టాడుతోంది. భారీ బడ్జెట్‌తో నెలల తరబడి తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతున్నాయి. కలేజా, పులి, ఆరెంజ్‌ లాంటి భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో... నెలల తరబడి తీసిన సినిమాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి నష్టాన్ని పూరించేది ఎవరు? ఆ సినిమాల నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ముఖ్య తారాగణానికి అయ్యే ఖర్చులు ఇంతా అంతా కాదు. హీరో హీరోయిన్‌లకు ముఖ్యమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు అయ్యే ఖర్చు రోజు రోజుకూ హనుమంతుని తోకలా పెరుగుతూనే ఉంటాయి. వారి కాస్లీ మెయింటనెన్స్,  ఇంకా హీరోయిన్‌ వెంట ఎగేసుకొచ్చే వారి ఫ్యామిలీ మెంబర్స్‌ ఖర్చులతో నిర్మాతకు చిరిగి 'శీకాకుళం' అవుద్దీ. ఒక వేల 'గాచారం గంటా మారి' సీన్‌లు సరిగ్గా కుదరక పోతే రీ షూటింగ్‌ అంటూ డైరెక్టర్లు నిర్మాతల ప్రాణాలు ( పైసలు) తోడుతారు. ఆ  నిర్మాతలు మింగలేక కక్కలేక వారి గోడు ఎవరితో చెప్పలేక మనసులోనే మధనపడుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఒరవడి అదీ మన రామ్‌ గోపాల్‌ వర్మ ద్వారా జరగనుంది. తెలుగు సినీపరిశ్రమను ''శివ'' ద్వారా కొత్త పుంతలు తొక్కించిన వర్మ నేడు 'దొంగలముఠా' ద్వారా ఐదురోజుల్లో సినిమా తీస్తానని ముందుకొస్తున్నాడు. ఇందులో రవితేజ, చార్మి, ప్రకాశ్‌రాజ్‌, లక్ష్మి మంచు, బ్రహ్మానందంలతో కేవలం ఐదు క్యారెక్టర్లతో, ఐదుగురు టెక్నీషియన్స్‌ను ఉపయోగించుకుని  ఈ ప్రయోగానికి ఒడిగడుతున్నాడు. అదే గనక సక్సెస్‌ అయితే మన నిర్మాతలకు ఈ  స్టార్ల డేట్స్‌ గురించిగానీ, అనవసర బడ్జెట్‌ గురించి గానీ ఎలాంటి టెన్షన్‌ ఉండదు. ఐదురోజుల్లో సినిమా విజయవంతంగా ఎలా తీయెచ్చో చూపిస్తానని సవాల్‌ చేసిన వర్మ దాన్ని సాధిస్తాడా లేక నవ్వినవాళ్ల ముందర జారిపడ్డట్టు చేస్తాడా వెయిట్‌ అండ్‌ సీ..... ఈ ప్రయోగనానికి సంకల్పించిన 'వర్మకు' ఆల్‌దబెస్ట్‌ చెపుతూ...

 

సుందర్

2 comments:

  1. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఒరవడి అదీ మన రామ్‌ గోపాల్‌ వర్మ
    its true

    ReplyDelete
  2. 'శివ'' ద్వారా కొత్త పుంతలు తొక్కించిన వర్మ నేడు 'దొంగలముఠా' ద్వారా ఐదురోజుల్లో సినిమా తీస్తానని ముందుకొస్తున్నాడు.
    varma always dare to anything

    ReplyDelete