అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, April 24, 2011

ఏదో ఫారిన్‌ టూర్‌ ఫ్లానుచేసుకుని వెళ్లినట్లు.... బాబా నలబై రోజులలో వస్తాడంట....

ఈ సంఘటన మీడియాకు దొరికిన కొబ్బరిచిప్ప టీవీలన్నీ లైవ్‌ షోలతో నిండిపోయాయి. బాబా పార్థివ దేహం ఎక్ల్సూసివ్‌గా చూడండి... బాబా ఇక లేరు.. బాబా మూడు రోజులలో లేస్తాడు... బాబా 14 రోజులలో వస్తాడన్న భక్తుడు.... బాబా కోసం ఆత్మహత్య...
లాంటి వార్తలతో బ్రేక్‌ తర్వాత చూడండి... బ్రేక్‌ తర్వాత చూడండి.......... ఈరోజంతా ఇదే న్యూస్‌ ...
దేవుడి చిత్ర పటంనుండి తేనె వస్తుందట.... అరే దేవుడు ఏదైనా తేనె తుట్టె పెట్టలేదు కదా...! నిన్న మొన్నటి వరకు రాని తేనే దేవుడుపోగానే వస్తుండంటంతో.. ఎడ్డి (గుడ్డి) భక్తజనం తండోపతండాలుగా వస్తున్నారంట... మీడియాది ఎంత ఎంత అవకాశవాదమంటే... ఏది సెన్సేషన్‌ సృష్టిద్ధామా.... రేటింగ్‌ పెంచుకుందామా.. అని చూడటం తప్పమరొకటి కాదు.. ఏదో  ఫారిన్‌ టూర్‌ ఫ్లానుచేసుకుని వెళ్లినట్లు.... బాబా నలబై రోజులలో వస్తాడంట..... బాబా 63వ జన్మదినం సందర్భంగానే చెప్పాడంట.. తను పోయేముందు నా ఆస్పిటల్‌ చుట్టూ పహారా ఉంటుందని.. అరే అరే దేవుడేంది ఆస్పిటల్లో ఉండటం ఏంది.. అసలు గిది రాసిందెవడు......
ఇలాంటివి రాసే నా కొడుకుల పిచ్చికుక్కలను కొట్టినట్టు కొట్టాలెబై. 
ప్రజాసమస్యలన గాలికొదిలి.. ఇలాంటి బాధ్యతా రహిత మైన వాఖ్యలు చేస్తూ దాన్ని మళ్లీ చూడండి మళ్లీ మళ్లీ చూడండి.... టీవీ ఆఫ్‌ చేయకండి... డాష్‌ డాష్‌ ... (ఆడాష్‌లో మీ ఇష్టమున్న బూతులు నింపుకోండి) చూస్తూనే ఉండండి అంటూ... అథమ స్తాయికి దిగజారి ప్రవర్తించడం నేటి మీడియాకే పరిపాటి.
సమాజానికి దిక్సూచిగా బాధ్యత గల ఒక ప్రత్యేక స్థానంలో ఉండాల్సిన మీడియా విలవల వలువలు విడిచి తప్పుడు సమాచారాలతో ప్రజలను పక్కదారి పట్టిచడం అంటే ఇంతకంటే దిగజారుడు తనం మరొకటి ఉండదు..   
సుందర్  

3 comments:

  1. నకిలీ కణిక వ్యవస్థ ఒక సమర్ధుడైన ఏజెంటును కోల్పోయింది. ఇటువంటి ఏజెంటును తయారు చేసుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది

    ReplyDelete
  2. babu sri jabeli. babanu ala ante kallu pothayee. babanu inni matalannanduku nuvvu student aythee fail avuthavu ledha job chestunte nee job poyee roddu medha padathav...........

    ReplyDelete