అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, April 26, 2011

ఓ బంగారూ... నువ్వు గింత పనిజేస్త వనుకుంటే నీ గురించి టపా రాయకపోదు గదా...

వామ్మో... నాకు భయ్యమైతాంది... నా కళ్లు పోతాయంట.... నేను ఫెయిల్‌ అయితానంటా... నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారంట... నేను రోడ్డున పడతానంటా... అయ్యో హైదరాబాద్‌లో రోడ్లన్నా సక్కగలేవే అన్నీ గుంతలు.. గుంతలు... ఏ గుంతలో పడతానో నేనేం సేసేదీ... ఓ బంగారూ... నువ్వు గింత పనిజేస్త వనుకుంటే నీ గురించి టపా రాయకపోదు గదా... ఏదో దుందుడుకుగా టపటపామని ఒక సిన్న టపా రాసినందుకు నా కళ్లు పోగొట్టి ఉన్న సిన్న కొలువు నుంచి తీయించి... సదువులో ఫెయిల్‌ జేస్తావా.. బంగారూ... నిన్ను ఏమీ అనకూడదా బంగారూ... ఎందుకు బంగారు నా మీద నీకు అంత పగ దేవుళ్లు కూడా కక్షసాధిస్తారా.....? గిది తెలుస్తే నేనేదేవున్ని ఏమీ అనకుండా కామ్‌గా ఎంకామ్‌ చేసుకునేవాణ్ణే... కటకటా.. ఎందుకు నాకీ తంటా అయ్యో.. అయ్యయ్యో... ఎవ్వరైనా.... సాయం సేయండి.. సేయండి... సేయండి.... తొక్కేంకాదు ఒరేయ్ అజ్ఞాత నువ్వుగానీ నాకుగానీ కన్పించు నీకు వాచీ ఉందోలేదోగానీ అది తప్పకుండా పోద్దిరోయ్.... మీలాంటి హవ్లేగాళ్ల వల్లే మూడనమ్మకాలు ఎక్కువౌతున్నాయి. నాకళ్లు పోతాయా.. ఎక్కడికి నాయనా కాశీ యాత్రకా... లేక కాజల్‌ దగ్గరికా... ఇక ఉద్యోగం గురించి అంటివిగదా.. నువ్వుకాదుకదా నీ తాతొచ్చినా నన్ను ఈ ఉద్యోగం నుంచి 'పీకిం'చలేరు నీకింకేమన్నా డీటైల్స్‌ కావాలంటే జెప్పు మీ బాబాతో జెప్తవో ఎంకవ్వరితో జెప్పి తీయిస్తవో తీయించుకో..... ఇక పరీక్షల్లో అంటావా.. రెండు నెలలు ఆగు.. మళ్లీ ఇదే రోజు 75 శాతం మార్కులతో పాసై.. మార్కులతో సహా  నీ  మెయిల్ కు ‌ సెండ్‌ చేస్తా...  (నీకు దమ్ముంటే నీ మెయిల్‌ ఐడీ పంపు నిన్నుఇంతకన్నా ఒక్క మాట కూడా తిట్టను. నువ్వు నమ్మేది నిజం కాదని ప్రూవ్ చేయడానికి మాత్రమె అడిగా...)
సుందర్

No comments:

Post a Comment