అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, April 24, 2011

దేవుడే పోయాక... బోడి మనుషులెంత..?


జగత్‌ విచిత్రం జరగింది అదేంటంటే... దేవుడు చనిపోయాడు.... మరీ అంత దీనంగా ఫేసు పెట్టకండి. నిజ్జంగా కలియుగ దేవుడు చనిపోయాడు. ఎలా అంటే రాక్షసులతో పోట్లాడి... రణభేరిలో కాదు... వయసు మీదపడి మనుషులకు వచ్చే సర్వ సాధారణ జబ్బుతో. చనిపోయారు.. ఈ వాఖ్యం చదివితే ఏ ( పిచ్చి )  భక్తుడికైనా అరికాళ్లనుంచి నడి నెత్తిదాకా సుర్రు......న కాలుతుంది కానీ ఇది నిజం... నిజం నిష్టూరంగానే ఉంటుంది. అరే మనుషులకు వచ్చే జబ్బు దేవుడికి రావడం.. ఒక ఇరవై రోజులుగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిష్ణాతులైన వైధ్యులచే చికిత్సలు చేయించడం... అయినా ఎంతకూ తగ్గకపోవడం.. చివరకు తుది శ్వాస విడవడం ఒకదాని వెంట ఒకటి టకటకా జరిగిపోయాయి. మనిషిగా చనిపోయిన సత్యనారాయణ రాజుకు సంతాపాన్ని తెలియజేస్తూ.... దేవుడైన బాబా కు బై బై  చెబుతూ.....

సుందర్

1 comment:

  1. నకిలీ కణిక వ్యవస్థ ఒక సమర్ధుడైన ఏజెంటును కోల్పోయింది. ఇటువంటి ఏజెంటును తయారు చేసుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది

    ReplyDelete