అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, April 19, 2011

గుంపులో గోవిందలా ఎందుకు...!!!

ఈరోజు హనుమజయంతీ ఉత్సవాలలో ఒక సంఘటన జరిగింది. చాలా మంది హనుమాన్‌ రథాన్ని లాగుతున్నారు..  అక్కడికి వెళ్లి కొద్దిసేపు వీడియో తీసుకుని రథం తాడు నేను కూడా పట్టుకున్నా... ఒక వ్యక్తి వచ్చి నాపక్కన నిల్చున్నాడు.. ఎవరబ్బా ఎక్కడో చూసినట్టుందే.. అనుకున్నా... కానీ గుర్తుకు రావడం లేదు.... కొద్ది సేపటికి గుర్తొచ్చింది. సినిమాల్లో ఆక్ట్‌ చేస్తాడు కదా.. అనుకున్నా... అతడే నర్సింగ్‌ యాదవ్‌ కొద్దిసేపు కాగానే అన్నా... నమస్తే రావే అంటూ... అతనిచేత ప్రత్యేక పూజలు చేయించారు.. అతను మళ్లీ వచ్చి నేను పట్టుకున్న దగ్గరే తాడు పట్టుకుని రథాన్ని లాగుతున్నాడు. చాలా సార్లు టచ్చయ్యాడు.. స్టార్లు అంటే గింతే కదా... అనుకున్నా కొద్దిసేపటికి ఒక్కొరుగా వచ్చి ఒక్కఫోటో సార్‌ అని అతనితో ఫోటోలు దిగుతున్నారు.. అందరూ హలో సార్‌ అని షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నారు.. నేనూ ఇద్దామనుకున్నా... కానీ అతనికి మనమేమన్నా గుర్తుంటామా... గుంపులో గోవిందలాగా ఇతనికి ష్యేక్‌హ్యాండ్‌ ఇవ్వడం ఎందుకు టైంవేస్టు అనుకుంటూ... ముందుకు వెళ్లిపోయాను...
సుందర్

No comments:

Post a Comment