అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, April 19, 2011

అబ్బబ్బబ్బబ్బా....... ఇంత వైభవంగా... నా లైఫ్‌లో ఫస్ట్‌ టైం.....!

ఈరోజు ఈవినింగ్‌ ఆఫీసుకు బయలుదేరాను కోఠికి రాగానే రాంనగర్‌ బస్‌ దొరికింది అమ్మయ్య.. ఆఫీసుకు తొందరగా వెళ్లొచ్చు అని కూర్చున్నా... ఐదు నిమిషాలవుతుంది... పది నిమిషాలవుంది... అర్థగంట అవుతోంది. బస్సు ఎంతకూ కదట్లేదు... ట్రాఫిక్‌ జాం ఇంతలా ఎందుకుంది అబ్బా అనుకుంటూ... ఆలోచిస్తోన్నా... కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా కదులుతూ.. కింగ్‌కోఠి వరకూ.. వచ్చింది బస్సు. అక్కడ కిక్కిరిసిన జనం ఉన్నారు. ఏదో ఊరేగింపు జరుగుతోంది. ఏం ఊరేగింపబ్బా ఇంత ఘనంగా జరుగుతోంది. అని దిగి చూస్తే హనుమజ్జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. హనుమాన్‌ ను ఊరేగిస్తున్నారు. పెద్దపెద్ద డిజెబాక్సులు... ముందున చిన్నపిల్లలూ.. అమ్మాయిలూ.. పెద్దవారు దాండియా ఆడుతూ.... హనుమాను ఊరేగిస్తున్నారు. నేనూ బస్‌ పోయేదేకా పాలుపంచుకుందామని దిగి రథాన్ని లాగే తాడును పట్టుకున్నా.... ఎందుకో తెలియదు పట్టలేని సంతోషం.. ఆ దృష్యాలను నా సెల్‌ ఫోన్‌లో బంధించాను.. కొద్దిగా ముందుకు కాచిగూడవరకూ నడుచుకుంటూ... వెళ్లాను అక్కడ యూత్‌ ఫుల్‌ జోష్‌గా బ్యాండ్‌కు అనుగుణంగా కర్ర సాముచేస్తున్నారు. స్టీల్‌ రాడ్‌కు ఇరువైపులా మంటలూ... అబ్బబ్బా... ఏం తిప్పుతున్నారు.. మినుగురులు ఎగిరి పక్కన వారిమీద పడుతున్నాయి.. తిప్పేవారిమీద పడుతున్నాయి. అయినా... ఆపకుండా... చాలా ... చాలా అద్భుతంగా తిప్పారు. ఇంకా హనుమా.. సీతా రామ లక్ష్మణ వేషాలు వేసారు.. రాథంపై వారుకూర్చన్నారు. మాకు ఇంతకు ముందు హనుమజయంతి అంటే ఒక హాళిడే మాత్రమే... ఉత్సవాల లాంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇంత ఘనంగా జరుపుతారా... అనుకున్నా... ఉన్న కొద్దిసేపయినా చాలా  ఎంజాయ్ చేసి.. ఆఫీసుకు బయలు దేరాను...
సుందర్

No comments:

Post a Comment