అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 25, 2010

సంకురాతిరి మంకురు.....



"సంకురాతిరి మంకురు.....
ఆకాశం నుండి భూమికి ఆరేసిన తెల్లని చీరలా...
సింగారంగా కమ్ముకుని ఉంది.
పదహారణాల పడుచులు తమ వన్నెలనన్నీ మలచి,
తెలుగింటి ముంగిళ్లల్లో రంగవళ్లులుగా పరిచారు.

ఈ కమనీయ దృశ్యాన్ని మబ్బులలో నుంచి దొంగ చూపులు చూస్తున్నాడా..?
అన్నట్లు ప్రభాత సూర్యుడు పైపైకి వస్తున్నాడు.
భాస్కరుని కిరణాలనే కొటె చూపులు పడగానే...
ఆ ముగ్గులు సిగ్గుతో కందిని అమ్మాయి బుగ్గలలా ముద్దొస్తున్నాయి.
ఆ రంగవళ్లుల మధ్య అలరారే గొబ్బెమ్మలు,
అంగరంగ వైభవంగా సింగారించిన బంగారు దుద్దులలా మైమరిపిస్తున్నాయి..
ఆ గొబ్బెమ్మలపై చల్లిన నవ దాన్యాలు..
నవ రత్నాలలా మణులు మాణిక్యాలలా...
మిరుమిట్లుగొలుపుతున్నాయి.
ఆ ప్రశాంతమైన పల్లె వీధులలో...
హరిదాసు కీర్తనలు ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.
గంగిరెద్దుల గెంతులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
పంటలు చేతి కందడంతో ఇళ్లన్ని కళ్లాల్లా... దాన్యాలతో నిండిఉన్నాయి.
ఆ ఇరికిళ్లలో బంధువుల సందడి రోకళ్ల సవ్వడి....
వంటిళ్లలోంచి వచ్చే పిండి వంటల ఘుమ ఘుమలు...
అబ్బో ఆ 'సుందర' దృశ్యాలు...
పండగ వాతావరణాన్ని చెప్పకనే చెబుతున్నాయి."
ur's sri

No comments:

Post a Comment