అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 25, 2010

విప్లవాల నయగారా చేగువేరా

"విప్లవాల నయగారా చేగువేరా
నీ ధైర్య చరిత చూసి నే ఎంతో మారా
నీది కాని దేశం లో నీతికై  సాగినావు
పీడుతులకు తాడితులకు
వెలుగు జ్యోతి వయినావు
కాస్ట్రో తో కలిసి నువ్వు క్యూబను రక్షించినావు
భక్షించే దుండగులను గన్నుతో శిక్షిం చినావు
శత్రువుల గుండెల్లో దడ పెంచిన చేగువేరా
నా గుండెల భయ నిద్రను చెరిపిన ఓ వేగు వేరా
నీ జీవన స్ఫూర్తి తోటి కోటి "చే"తులుద్బవించే
ఆ "చే"తుల సడులతోటి నా "చే"తులు కలుపుతాను
నీవు చూపినా బాటలో విఫ్లవమై సాగుతాను
ఇదే నా ప్రతిన, ఇది నీ మీద ఆన"
ur's sri

No comments:

Post a Comment