అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, August 26, 2010

టకటకమని.. టకటకమని..

టకటకమని.. టకటకమని..
టకటకమని... చిన్నముళ్లు కదులుతోంది
వడివడిగా...
అలుపన్నది లేకుండా
ఆలస్యం చేయకుండా
సాగుతోంది....
ముందుకు...
మున్ముందుకు
నిమిషాలను కదిలించగ
తను అరవై మెట్లెక్కెను
గంట గణగణ మ్రోగ...
అరవైనరవైసార్లు
అతి సులువుగ
కరిగింగెను తిరిగేసెను...

రోజులు ఏళ్లను యుగాలనే
మోసుకుంటూ ... దూసుకుంటూ
వెనుదిరిగి చూడకుండా...
వెనుకడుగే వేయకుండ
లక్ష్యమంటు లేదు గాని
కక్ష్యలోనే సాగుతుంది.
కాలం.. కలకాలం... ఎల్లకాలం
టకటకమని.. టకటకమని.. టకటకమని... 
సుందర్

No comments:

Post a Comment