వచ్చేయ్ వచ్చేయ్ వానమ్మా....
వడివడిగా నువు రావమ్మా,
కోటి ఆశలతో కోట్ల ప్రజలు,
నీ రాకకై వేచి ఉన్నారు.
భూమాత గొంతు తడి ఆరింది,
నా రైతు గుండె దడ పెరిగింది.
మా బతుకు పతంగికి దారం నువ్వు,
మా పొట్టకూటికాదారం నువ్వు.
నీవు లేని మా జీవనమేలా?
మాపై నీకు కోపం ఏలా...?
నీ చల్లని దీవెన కురిపించాలి,
ఆ కరుణ జల్లె ఇహ,
వాన జల్లులై పంట పొలాలను తడపాలి.
బీటలువారిన భూమిల సైతం,
పసిడి పంటలు పండించాలి.
కళ తప్పిన నా నేల తల్లికి,
ప్రకృతి పచ్చని చీరని చుట్టాలి.
సర్వజనులు సకల సంపదలతో,
సుఖ జీవనయానం చేయాలి
సుందర్
ur's sri
helo baggundi
ReplyDeletechala bagundi
ReplyDelete