నిదురించే సమాజాన్ని
నింధించిన నా కళమా.
నినదిస్తూ ఎధిరించేందుకు
మున్ముందుకు సాగమ్మా..
బలిసినోడి దురాగతాలకు
అడ్డుకట్ట కావాలి.
పేద వాడి గుండె చప్పుడుకు
బాణి నువ్వు అవ్వాలి..
నిన్న నేడు అయ్యింది.
నేడు రేపు అవుతుంది..
పేద వాడి చెమటచుక్కకూ
రేటు తగ్గిపోతోంది.
నేటిని కరిగించుకుంటూ
రేయి తరిగిపోతుంది.
ఉన్నవాడి చుట్టేకాలం
గింగిర్లు కొడుతుంది.
సాగేది పూబాటని
కళ్లు కలలు కన్నాయి.
పూల కింద ముళ్లున్నాయని
తెలియకేగుతున్నాయి.
సారంగ నీతి మాటల
బూటకంలో కూరుకుపోతే...
పూల గుట్టు విప్పాలి...
ముళ్ల మొనలు తృంచాలి...
మంచిని వంచించే వారిని
మసి బొగ్గును చేయాలి
నింధించిన నా కళమా.
నినదిస్తూ ఎధిరించేందుకు
మున్ముందుకు సాగమ్మా..
బలిసినోడి దురాగతాలకు
అడ్డుకట్ట కావాలి.
పేద వాడి గుండె చప్పుడుకు
బాణి నువ్వు అవ్వాలి..
నిన్న నేడు అయ్యింది.
నేడు రేపు అవుతుంది..
పేద వాడి చెమటచుక్కకూ
రేటు తగ్గిపోతోంది.
నేటిని కరిగించుకుంటూ
రేయి తరిగిపోతుంది.
ఉన్నవాడి చుట్టేకాలం
గింగిర్లు కొడుతుంది.
సాగేది పూబాటని
కళ్లు కలలు కన్నాయి.
పూల కింద ముళ్లున్నాయని
తెలియకేగుతున్నాయి.
సారంగ నీతి మాటల
బూటకంలో కూరుకుపోతే...
పూల గుట్టు విప్పాలి...
ముళ్ల మొనలు తృంచాలి...
మంచిని వంచించే వారిని
మసి బొగ్గును చేయాలి
సుందర్
No comments:
Post a Comment