అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, October 21, 2010

నా నిదురను దొంగిలించింది ఎవరు


నా నిదురను దొంగిలించింది ఎవరు? అరే ప్రశ్ననే చాలా విచిత్రంగా ఉంది కదూ..! అవును ప్రశ్నే కాదు నా సమస్య కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సమస్య ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండకపోవచ్చు. నా రోజు వారి కార్యక్రమాలు ఉదయం నుండి చెప్పడం కంటే సాయంత్రం నుంచి చెబితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ నుండి చెబితేనే చాలా కిక్‌ ఉంటుంది. నేను సాయంత్రం 6.30 నుంచి రాత్రి 2.30 వరకు ప్రజాశక్తి వెబ్‌సైట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. అయితే ఇది కాదు అసలు విషయం నేను ఉదయం 9 గంటలకు కాలేజ్‌కి వెల్లాలి.. అయ్యో నేను ఏం చదువుతున్నానో చెప్పకుండానే కాలేజ్‌ అంటున్నాను కదా... నేను బద్రుకా కాలేజ్‌లో పీజి (ఎమ్‌కాం) చేస్తున్నాను. రాత్రి చాలీ చాలని నిద్ర దానికి తోడు పొద్దున్నే కాలేజ్‌ ఆ కాలేజ్‌ కాస్తా అయిపోయే సారికి 2 నుంచి 2.30 అవుతుంది. నేను కాలేజ్‌ నుంచి రూంకి వెళ్లే సరికి 3.30 అవుతుంది. ఇకేంటి ప్రెష్‌ అప్‌ అయి తినే సరికి మళ్లీ జాబ్‌ టైమ్‌ అవుతుంది. కాబట్టి మళ్లీ బ్యాగ్‌ సంకన వేసుకుని బయలు దేరుతనే ఉండాలి. నా నిద్రను దొంగిలించింది నైట్‌ డ్యూటీయా మార్నింగ్‌ కాలేజ్‌ ఆఆ లేక తీరిక లేకుండా ఏదో పొడిచేద్దామనే లెవల్లో పని చేస్తున్న నేనా.. ఇంతకు ఈ సమస్యకు కారణం ఎవరు.. అంటే కచ్చితంగా చెప్పలేను కానీ ఫస్ట్‌ నిందిచవలసింది మాత్రం నన్నే.. చదివే మీకు చాలా సిల్లీ గా అనిపిస్తుండవచ్చు కానీ ఒక్కసారి అనుభవించి చూస్తే తెలుస్తుంది. ఈ విషయం గూర్చి నా స్నేహితుడంటాడు జాబ్‌ ఎందుకయ్యా చదువుకోక అని అంత మాత్రం మాకు తెలియదు మరి? ఎందుకంటే ఏంచెబుతాం... అవసరం... అవసరం అనే కంటే అత్యవసరం అంటే బాగుంటుందేమో... ఈ రాత నా నిద్ర గురించి మొదలై ఎక్కడికెక్కడికో వెళ్లిపోతుంది. కాబట్టి నేను చెప్పేదేమిటంటే నా నిదురను దొంగిలించింది ఎవరు అంటే ఇంత చదివిన మీరే చెప్పలేకపోతే... నేను మాత్రం ఏమి చెప్పగలను..

 
సుందర్

No comments:

Post a Comment