నేను నిన్న రాతిర రికార్డ్ రాస్తుండగా ఎందుకో నాకు ఒకటి యాదికొచ్చింది. ఏందంటే బెంగాల్ టైగర్‌కి ఫోన్ జేయాలనిపించింది. వెంటనే నంబర్ కొట్టాను తొల్త ఏమీ ఇనపడ్లేదు కొద్దిగయ్యినంక కొంతకొంత ఇనిపిస్తుంది. ఏందంటే... ఏముంటది? బెంగాల్ టైగర్ ఎక్కడుంటే గక్కడ లొల్లి ఉంటది గదా..! గదే గా లొల్లే ఇన్పిస్తుంది. సానా సేపయ్యినంక మెల్లిగా గొంతు ఇనవడ్డది నాకు పట్టలేని సంతోసం. నేను డవిరెక్టుగా నా గొంతుతో మాట్లాడక గొంతు మార్సి మాట్లాడిన. అప్పుడు నాకు ఇగ ఒక్కటే ఎక్సైటింగు టైగర్ నా గొంతు గుర్తుపడతాడా అని ఇగ మార్చి మార్చి మాట్లాడుతుంటే. ఎవరు అన్నడు నేను వేరే పేరు జెప్పే సరికి ఇగ గుర్తు పడ్తలేడు. ఆ లొల్లికి ఇనిపించలేదో మరి నా టాలెంటో తెల్వదు గానీ... మొత్తం మీద చివరదాకా టైగర్ నా గొంతు గుర్తుపట్టలేదు. ఇగ సీరియస్ అయితుండు అగ కోప్పడుతుండు. నాకు భయమయ్యింది లాస్ట్‌కు నేనే చెప్పేసరికి కూలయ్యిండు. నా బ్లాగ్ సదివిన నని జెప్పిండు. నేను ఎగిరి గంతేసిన... బెంగాల్ టైగర్......... నా....... బ్లాగు ..... సదవడమా.... ఒకటే దుంకులాడుతున్నా.... లాస్ట్‌కు కొద్దిగాగి మాట్లాడుతుంటే ఇగ మల్ల కోపమైతుండు ఎందుకు అని అడిగితే నన్ను అడుగుతుండు.. 'నీ బ్లాగ్లా నా ఫోటో గెందుకు పెట్టలే' అన్నడు ఇగ నేను షాకయ్యిన అరె గిన్ని రోజుల్నుంచి బ్లాగు రాస్తున్న గదా మా బెంగాల్ టైగర్ ఫోటో బెట్టాల్నని ఒక్క సారి గూడ సోంచాయించపోతి. ఇగ ఒక్కసారి టక్కయిన.. సరే సరే టైగర్ నేను గియ్యల్ల తప్పకుండా నీ ఫోటో పెడ్త ఏం ఫికర్‌జెయ్యకు అని జెప్పిన అప్పుడు కొంచెం శాంతమయ్యిండు. గందుకనే గిప్పుడు టైం నాతటీలి ఒకటిగొడుతుంది అయినా సరే నా టైగర్ కొరకు గిదంత రాసి గీ బ్లాగుల పెడుతున్నా.. మరీ గా బెంగాల్ టైగర్ ఎవరునుకుంటుండ్రు...
.
.
.
.
.
.
.
గాడే మా కాంత్ గాడు కాంత్ అంటే శ్రీకాంత్‌గాడు నాజిగిరి తమ్ముడు.. గాన్ని మేము ముద్దుగ బెంగాల్ టైగర్ అని పిల్చుకుంటం గాడు గిప్పుడు బాసర ఐఐఐటిల సదువుకుంటుండు ఇగ గాడు రేపు గిదంతా సదువుతడు మా సుందరన్నను నా ఫోటో బెట్టమంటే గిదంత సోది రాసిండు మా దోస్తుగాళ్లకు ఎట్ల సూపియ్యాలబ్బా అనుకుంటడు గానీ తర్వాత వాడే సూపిస్తడులే మీరు ఫీల్ గాకుర్రి మీ గురించి గిట్ల ఎప్పుడో అప్పుడు రాస్తలే మా టైగర్ గాడికి తెలంగాణా యాస అంటే మస్త్ ఇస్టం గందుకనే గీ యాసల రాస్తున్నా గాడు రేపు ఫోన్ జేసి ఏమంటడో ఏమోపో ఇగ రాసుడు బంజేస్తున్నా....... ఆగుర్రాగుర్రి గింత జెప్పిన గదా గా హీరో ఫోటో మీరు సూడరా సూడుర్రి
1
2
3
4
5

సుందర్
No comments:
Post a Comment