అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, February 14, 2011

నీకై ఆరాటం ఎందుకంటే...!

నీకై ఆరాటం
ఎందుకంటే...
నా ప్రాణం, గానం నీవనా..
కష్టనష్టాల్లో కన్నీరు దరిచేరనీవనా..
నీ ఆప్యాయత, అభిమానం నావనా...
మహా సంద్రంలాంటి జీవితంలో నీవే నా నావనా...
ఏ దారిలేని గోదారిలా..
పరిగెడుతున్న నాకు...
రహదారివై...
దిశ,దశ చూపినందుకా...
రంగుల కలలు పంచి
నా కళల సాకారానికి..
ప్రాకారం నీవైనందుకా...
ఎందుకో ఒకందుకు..!
అందుకే... అందుకే...
నీకై ఆలోచన.... ఆరాటం.....!
సుందర్

1 comment: