అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, February 27, 2011

అంత సత్తా ఎవరికుంది....?

సచిన్‌ అంటేనే క్రికెట్‌ క్రికెట్‌ అంటే సచిన్‌ అన్న విదంగా తన ఖ్యాతిని పెంచుకున్న టెండూల్కర్‌ ఈరోజు ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌లో మరో సారి విశ్వ రూపం ప్రదర్శించాడు.  మొదట నిదానంగా ఆడిన సచిన్‌ తర్వాత సిక్సర్ల మోత మోయించాడు. మొత్తం ఐదు సిక్సర్లతో, పది ఫోర్లతో సెంచరీ నమోదు  చేసుకున్న సచిన్ 120 పరుగులు చేశాడు‌, ఈ సెంచరీ తో ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు కొట్టిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మరో రెండు సెంచరీలు కొడితే సెంచరీల సెంచరీని చేరుకున్న ఏకైక బ్యాట్మెన్‌గా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిఉంటాడు.మరో 60 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో మొదటిసారి 2000 పరుగులు సాధించిన రికార్డు కూడా సచిన్‌ ఖాతాలోకి చేరుతుంది. ఓ రికార్డుల రేడా...! నీకు సాటి ఎవరు లేరు... నిన్ను దాటి ఎవరూ పోరు.....?

No comments:

Post a Comment