అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, March 2, 2011

మళ్లీ అలానే జరుగుతుందా....?

నేను చిన్నప్పటినుండి ట్రై చేస్తున్నా... ఈ సారి తప్పకుండా ఉపవాసం ఉండాలని ప్రతీ సారీ అనుకుంటా కానీ తీరా ఆ ప్రయత్నం విఫలమవ్వడం మళ్ళీ మూడు పూటల లాగించడం. పండ్లు కూడా విడిచిపెట్టకుండా తినడం. ఇలా ఇంత వరకూ నా లైఫ్‌లో ప్రతీ శివరాత్రి గడిచిపోతోంది. కానీ చాలా ట్రై చేసా ఒకసారి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఉన్నా ఆరోజు నా గాచారం గంటా మారి మా మేనత్త భర్త చనిపోయాడు. ఖతం అప్పుడు ఉపవాసం ఉండకూడదని మాన్పించేసారు. మళ్లీ ఒక సారి ఉన్నా మధ్యాహ్నం అవుతోంది. మా అన్న క్లాస్‌ ఉపవాసం అనేది సంవత్సరానికి ఒకసారి ఉంటారు. నువ్వు కాలేజ్‌కి ఒక్కో సారి అన్నం తినకుండానే వెళ్లి మళ్లీ సాయంత్రానికి వస్తావు నీకు ఇంకేం ఉపవాసం రా అనడంతో డిగ్రీలో నా ఉపవాసం డమాల్‌ అప్పటినుండి. ఉపవాసం ఉందామనే ఆలోచనే లేకుండా పోయింది. ఉదయం నుంచి రాత్రి వరకూ మూడు పూటలా మెక్కడం, నైట్‌ మళ్లీ పండ్లు తినడం. ఉపవాసం ఉన్నవారితో పాటు ఆటలు ఆడుతూ, టీవి చూస్తూ ఉదయం మూడు నాగులు గంటలదాకా మెలుకువ ఉండి తర్వాత పడుకోవడం ఇది నా శివరాత్రి ప్రతీ సంవత్సరం జరిగే కథ. మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతోందో....?
సుందర్

No comments:

Post a Comment