అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, March 9, 2011

అవి తప్ప, మిగతావన్ని మొగోళ్లయా....?

లెవ్వు లెవ్వమ్మా.... మీ లేడీస్‌ సీట్ల గూర్చుంటే... కూసోనిస్తారూ....? 
మీరు మా మొగోళ్ల సీట్ల ఎందుగ్గూసోవాలే...?
అంటూ.....

ఒక పెద్దమనిషి సుమారు ముప్పై..ముప్పై అయిదు సంవత్సరాలుంటాయతనికి అతడు ఆడవాళ్లను ఆ సీట్లోనుండి వెల్లగొడుతున్నాడు. సూడు మీ లేడీస్‌ సీటు కొరకు వేసిన పచ్చ రంగు సీట్లు ముందే అయిపోయినయి. గిది మొగొళ్ల సీటు... కనిపిస్తలేదా..? అంటూ దబాయిస్తుండు.. అప్పుడు.. పక్కనే ఉన్న చదువుకునే విద్యార్థులు(అబ్బాయిలు) కూడా దానికి ఊతం పాడుతున్నారు. ఇంకేం ఆ మహిళలు   లేవడానికి సిద్ధమయ్యారు. 
అప్పుడే నేను... కొంచెం ఆగమ్మా అన్నా... ఆమె వైపు చూస్తూ...
ఏమైంది భై ఎందుకు ఆగమంటున్నవ్‌ నువ్వుగిట్ల కూసుంటవా ఏంది..? అంటూ ముందుకొచ్చాడా... పెద్ద మనిషి... అప్పుడు నేనన్నాను నిన్నొక ప్రశ్న అడుగుతాను చెబుతావా అన్నాను... ఆ అడుగు అన్నాడు ఆ వ్యక్తి ధీమాగా.... కొంచెం ఠీవీ ప్రదర్శిస్తూ..!
అవునూ... పచ్చ కలరు రంగు వేసిన సీట్లన్నీ మహిళలయా... మిగతా వన్నీ మగవాళ్లవా..? అని అడిగాను....
అరె ఫాగల్‌గానిలా ఉన్నవేం భై  గాడ గన్పిస్తలేదు.. ఆడోళ్ల బొమ్మ అన్నాడతడు...
అతనికి మిగతా వారందరి సప్పోర్టు.. అప్పుడు నేను చెప్పిన లేడీస్‌ రిజర్వేషన్‌ సీట్లు అంటే అందులో కేవలం ఆడవాళ్లు మాత్రమే కూర్చోవాలి.... అంతేగాని మిగతావన్నీ జెన్సు సీట్లు కాదు.. జనరల్‌ సీట్లు అన్నా... ఆ ఏందీ జనరల్‌ సీట్లు ఏంది...? అని మళ్లీ అడగ్గానే..నా పక్కన నిల్చున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా నాతో పాటు గొంతు కలిపారు. అవును మన భారత దేశంలో ఒక మహిళను 'తల్లిగా, చెల్లిగా, భార్యగా'.. ఎంతో గౌరంవంగా చూసుకుంటాము.. అలాంటి మహిళల కోసం మన రాజ్యాంగంలో పొందుపర్చినది ఈ మహిళా రిజర్వేషన్‌... ఆ సాకు చూపి కేవలం రిజర్వ్‌డ్‌ సీట్లు మాత్రమే మహిళలవని మిగతా సీట్లన్నీ మగాళ్లవని మనం దబాయిస్తున్నాము. జనరల్‌ సీట్లంటే....? అందులో ఎవరు ముందొచ్చి కూర్చుంటే వారిదే ఆ సీటు అనగానే ఆ వ్యక్తి నోరెళ్ల బెట్టాడు... ఇంకేముంది ఆ మహిళల నుంచి ఒక చిన్న చిరునవ్వు...
మాకు తెల్వక లేస్తున్నము సార్‌ గిప్పట్నుంచి ఎవ్వరన్నా లేపని వాళ్లపనిజెప్తం అంటూ ముక్త కంఠంతో అన్నారు. ఆ సీట్లో, మరియు ముందు సీట్లలో కూర్చున్న మహిళలు....
మహిళా దినోత్సవం రోజు ఈ సంఘటన జరగడం నాకు ఆనందంగా అనిపించింది....
సుందర్

3 comments:

  1. ఇదే విషయం మీద గతం లో నేను కూడా బస్సు లో కొందరికి జ్ఞాన బోధ చేస్తే నన్ను పిచ్చోడ్ని చూసినట్లు చూసారు...

    ReplyDelete
  2. baabu...mari bus anta aadolle kurchunte,mogollekkada koosovaale...mee reservationlu anni peti peti mogollani bassu paina gitla gurchobetva peddaayana

    ReplyDelete
  3. సుందర్ గారు, సమయస్పూర్తితో మీరు చూపిన చొరవ అభినందనీయం.. అది అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సామాజిక స్పృహతో అందరూ మెలగడం ఎంతైనా అవసరం.. ఇటువంటి విషయాలు తెలిసినా కూడా మనకెందుకులే లేనిపోని గొడవ అనుకునే వాళ్ళే ఎక్కువ.. మంచి స్పూర్తినిచ్చేదిగా ఉంది ఈ అంశం.

    ReplyDelete