అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, March 9, 2011

గురితప్పక గుచ్చుతుంది, ఇలలో... మనుషులలో....!

గళమా..
గలగలపారే... గానమా...
మనసుల దోచె గాలమా...
ఉద్వేగం... ఉక్రోషం..
ఆనందం... ఆవేదన..
ప్రణయం... ప్రళయం
వినయం... విప్లవం
గారం...శృంగారం...
అందాలను... బందాలను...
నేర్పుతోటి, కూర్పుతోటి...
ఎంతో ప్రావీణ్యంతో
వెలువడె నీరాగం...
మందిరాన మధురమై...
విప్లవాన...జ్వలనమై
విల్లమ్ములకంటే పదునై.
గురితప్పక గుచ్చుతుంది
ఇలలో... మనుషులలో...
సుందర్

No comments:

Post a Comment