నానాటికి ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇజ్జత్ లేకుండా పోతుంది ( చేసుకుంటున్నారు). ఒక ప్రజా ప్రతినిదిగా, గౌర ప్రదమైన వ్యవసాయ మంత్రిపదివిలో ఉండి ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన పెద్ద మనిషి (వైఎస్‌వివేకానంద రెడ్డి) ఏకంగా అసెంబ్లీలో మీసం మెలేస్తూ ప్రతిపక్ష పోడియంపైకి దాడికి పూనుకున్నాడంటే.... ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఎవ్వరు అడ్డం వస్తే వారిపై దాడిచేస్తూ ఒక రౌడీలా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసనీయంకాదు. ఇదంత చేసిన తర్వాత ఆవేశానికి లోనయ్యా... అంటే ఏంటి అర్థం. అంటే వేరేవారికి ఆవేశం రాదా...? పేద్ద ఈయనొక్కడే పోటు మొనగాడా...? ఇదంతా చూస్తూ బొమ్మలా నిల్చున్న ముఖ్యమంత్రి దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు అంతా అయినంక క్షమాపణ చెప్పడం లాంటి దొంగనాటకాలేం నడవవు .... ఇలాంటి వారు ఉండాల్సింది అసెంబ్లీలో కాదు... ఆయన రౌడీయిజం ఆయన ఇంటికాడ చూపించుకోలే... ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అమూల్యమైన సమయాన్ని వృధాచేస్తూ.....మా (ప్రజల) అసెంబ్లీలో ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం కరెక్టు కాదు. ఇలాంటి వాడిని వెంటనే బర్తరప్ చేయాలి. అసెంబ్లీపై ప్రజలకున్న కాస్తో కూస్తో గౌరవాన్ని నిలబెట్టుకోవాలి.
సుందర్
సుందర్
వైఎస్‌వివేకానంద రెడ్డి is a "malicious side effect" of YSR.
ReplyDeleteThe real culprit was YSR. And his son (Jagan)continuing that tradition with corrupt money.