ఈజట్టా ప్రపంచ కప్ కొట్టేది...? పసి కూనలపై చెమటోడ్చి నెగ్గింది...?బౌలింగ్‌లో అసలు పసలేదు. 330 పరుగులు చేసి ఎదుటి జట్టును కట్టడి చేయలేకపోయింది. 40 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 268 స్కోరుతో పటిష్టంగా ఉన్న జట్టు టపటపా వికెట్లు కోల్పోయి చివరకు 296 పరుగులకే ఆలౌటయ్యింది. క్వార్టర్స్ దాటడమే కష్టం ...ఇక ప్రపంచకప్ భారత్ క్రికెట్ జట్టు కలగానే మిగులుతుంది....í
అని విమర్శలు చేసిన జట్టు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఘోర పరాజయం పాల్జేసిన ఆసిస్ జట్టును క్వార్టర్స్ నుండే ఇంటి దారి పట్టించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సెమీస్ లోనే మట్టి కరిపించింది. ఇక మిగిలింది పూర్ణకుంబాన్ని కొట్టడమే.. ఇంత వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు లేదా.. ఇద్దరే రాణించారు. ఇక మిగిలింది ఒకటే మ్యాచ్ అదీ కప్ తెచ్చి విశ్వ వినువీదులలో భారత పతాకాన్ని ఎగరేసే అద్భుత అవకాశం...
ఫైనల్‌లో వీరు.. విజృంభన... మాస్టార్ 'బ్లాస్టార్' ప్లే... గంభీర ఇన్నింగ్స్... యువీ ఉరకలు... రైనా... రౌద్రం... మహేంద్రుని... మెరుపులు.. జ'హీరో'యిజం అన్నిటిని ఏకం చేసే సమయం ఆసన్నమైంది. గెలుపే ధ్యేయంగా.... లక్ష్య సాధనకై ముందడుగేస్తే ఎదురొచ్చే దమ్మూ... ధైర్యం... శ్రీలంకకు ఉన్నాయంటారా... అహా ఉన్నయంటారా అంటా...!
సుందర్
No comments:
Post a Comment