అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, March 11, 2011

కావాలనే మిలియన్‌ మార్చ్‌ను ఆపలేదా...?

ఈరోజు జరిగిన మిలియన్‌ మార్చ్‌ జరిగిన విదానం చూస్తే.... మిలియన్‌ ప్రశ్నలు మెదలాడుతున్నాయి...!
1) మిలియన్‌ మార్చ్‌కు అనుమతి ఎందుకు ఇవ్వలేదు...?
2) రాష్ట్ర పోలీసులు, అదనంగా కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ ఈ మార్చ్‌ను ఎందుకు ఆపలేక పోయారు...?
3) నిన్నటి వరకూ కెసిఆర్‌ ఈ మార్చ్‌కు దూరంగా ఉంటాడు అంటూ వచ్చిన పుకార్లను పటాపటాపంచలు చేస్తూ.... కెసిఆర్‌ ట్యాంకు బండ్‌ దగ్గర ఒకే సారి ఎలా ఊడిపడ్డాడు...?
4) కాంగ్రెస్‌ నేతలు తామంతట తాము వచ్చారా...?
పార్టీ  ప్లాన్ తోనే   వచ్చారా...?
5) పార్లమెంటులో మార్చ్‌ నిర్వహిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు చేసిన ఒక ప్రకటన ఏంటంటే కాంగ్రెస్‌ ఎంపీలపై దాడి విగ్రహాల ద్వంసం గురించి మాట్లాడుతూ 'ఇలాంటి అరాచక కార్యకలాపాలే తెలంగాణాను ఇంకా దూరం చేస్తాయనడంలో' ఉద్ధేశం ఏమిటి...?
7) అంటే కావాలనే ఈ మిలియన్‌ మార్చ్‌ను ఆపలేదా...?
8) విగ్రహాలను ద్వంసం చేసేప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారు....? కొన్ని విగ్రహాలు ద్వంసం చేసిన తర్వాత ఎక్కడనుండి ఊడిపడ్డారు....?
9) అన్ని జిల్లాలనుంచి వచ్చే జనాన్ని ఆపగలిగిన పోలీసులు ఈ కొంత మందిని మాత్రం ఎందుకు ఆపలేకపోయారు...?
10 ) ముందగానే అరెస్టు చేయబడిన కోదండరాం మళ్లీ ట్యాంక్‌ బండ్‌కు ఎలా వచ్చాడు...?
11) విగ్రహాలను ద్వంసం చేస్తుంటే అక్కడే ఉన్న కెసిఆర్‌ దీన్ని ఎందుకు ఆపలేకపోయాడు...?  ఆ తర్వాత దీన్ని ఎందుకు ఖండిస్తూ వ్యాఖ్యలు చేసాడు...?
12) ఉద్యమం చేయి దాటిపోయిందా...?
13) ట్యాంక్‌ బండ్‌ గటనలో నిజంగానే అరచకవాదులు, నక్సల్స్‌ చేరారా...?
14) ఇదంతా ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు కేంద్రం, సీమాంద్ర బడానాయకులు ఆడించిన డ్రామానా....?
15 ) ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది...? రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదా.....?

ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలకు సమాదానం ఉన్నా... లేనట్టు.... లేకున్నా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది జిత్తుల మారి నక్కల చేతిలో నలుగుతున్న అమాయకపు తల్లి నా తెలంగాణా బాధ. త్యాగం తప్ప స్వార్థం తెలియని విద్యార్థుల ఊపిరితో కొనసాగుతున్న గాథ..!

సుందర్

1 comment:

  1. Yes, it is obvious. List of statues to be given for demolishan also approved by the government, to give such cheap sense of success to the mob. It is all hand-in-glove with center.

    ReplyDelete