అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, May 16, 2011

మహానుబావుడు ఏ క్షణాన రాసిండో గాని స్టూడెంట్‌ లైఫ్‌కు ఏమన్నా సింక్‌ అయితదా...!

ఓగాడ్‌ చేతికేమో పుస్తకమిచ్చావ్‌.. టూబ్యాడ్‌ వంటికేమో బద్దకమిచ్చావ్‌...  
మహానుబావుడు ఈ లిరిక్స్‌ ఏ క్షణాన రాసిండో గాని స్టూడెంట్‌ లైఫ్‌కు ఏమన్నా సింక్‌ అయితదా...! ముఖ్యంగా నా లైఫ్‌కు అయితే చాలా కరెక్టుగా సూటవుతుంది. ఎక్జాంలు వచ్చాయంటే... భయమైనా భక్తైనా ఉండాలంటా... మరి ఆ అక్షరాలు మన డిక్షనరీలో లేనే లేవాయే... ఇంటర్‌లో సెంట్‌ పర్సెంట్‌ కు ఒక్క మార్కు తక్కువొచ్చినా... ఎందుకొచ్చిందబ్బా.. అని తెగ ఆలోచించి.. చించీ.. ఏ తప్పులేనట్లయితే నాకు అర మార్కు ఎందుకు తక్కువ వేసారు సార్‌ అంటూ.. సార్లతో.. పేద్ద గొడవకు దిగేవాణ్ణంటే అర్థం చేసుకోవచ్చు.. దాంతో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ లో 90 శాతం మార్కులతో కాలేజీ టాపర్‌... ఇక ఏ ముహుర్తాన డిగ్రీలోకి అడుగెట్టానో గానీ గీ మార్కులతో ఏం జేసుకుంటం రా బయ్   అన్న ఒక ఆలోచన.. నా జీవితాన్నే కాదు... నా మార్కులనూ మార్చేసింది. సెమిష్టరు సిస్టమ్‌.. పెట్టి ఇయర్‌ అయిపోకముందే అందులో ఏ సిలబస్‌ చదివామో గుర్తులేకుండా తయారైంది.... ఏముంది బై సగం సిలబస్‌ ఒక్కరోజు కూర్చుంటే సరిపోతుందనే ఒక కాన్ఫిడెన్సు ( తలపొగరు)... రేపు ఎక్జాం ఉందంటే నైటంతా జాగారం చేయడం ఆరోజు సిలబస్‌ మొత్తం కంప్లీంట్‌గా చదవడం.. తెల్లారి... ఎక్జాం తర్వాత బుర్రలోంచి చెరిపెయ్యడం.. మళ్లీ ఎక్జాంకూ... ఎక్జాంకు రెండు రోజులు గ్యాప్‌ వచ్చినా.. ఎల్లుడి టైం ఉంది కదరా... ఎందుకు టెన్షన్‌ అనే ఒక అసంకల్పిత ఆదేశం వస్తనే ఉంటది... మరి మనకు రేపు ఎక్జాంఉంది. అంటేనే చదవడానికి మూడొస్తది... దాంతో మూడు సంత్సరాలకు ముచ్చటగా ఫస్టుక్లాసు మార్కులు వచ్చినప్పటికీ పర్సెంటీజీ విషయం పదిమందిలో దర్జాగా తీసుకునేంత సీన్‌ లేకుండా వచ్చింది....
ఇక పీజీలో కూడా సెమిస్టరు సిస్టమ్‌.. ఇప్పుడూ.. అప్పటి బద్దక... వాసన ఇంకా వదల్లేదు ఎంత ముందుగా ప్రిపేర్‌ అవుదామన్నా రేపు ఎక్జాం అంటేనే.. కొద్దిగా చదువుదాం అనిపిస్తుంది... గిట్ల చదువుకుంట పోతే మన పని గుగ్గు... దగ్గర్లో ఉన్న గోల్‌ కాస్తా... దూరం దూరం ఉరుకుతుంటే.. మరి భయమైతుందా.. భక్తి వస్తుందా...? వెయిట్‌ అండ్‌ సీ....
సుందర్

No comments:

Post a Comment