అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, July 1, 2011

అవినీతిపై ప్రశ్నిస్తే రక్తం కళ్లజూస్తారా..? ప్రజాస్వామ్య దేశమేనా ఇది...?


ఒక యూనివర్సిటీకి గౌరవ ప్రదమైన వైస్‌ఛాన్సలర్‌గా ఉంటూ... అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తి గురించి ప్రశ్నిస్తే లాఠీలు సమాధానం చెప్పాయి. తలలు పగిలినా, రక్తం చిందినా అవినీతి విసిపై చర్యలు తీసుకోవాలని నినదించిన పిడికిళ్లకు సంకెళ్లు పడ్డాయి. వారికి లాకప్‌లో చిత్ర హింసలు మిగిలాయి. ఇదీ మన ప్రజాస్వామ్య దేశం దుస్థితి. ద్రవిడ యూనివర్సిటి విసి కడప రమణయ్య అవినీతి అక్రమాలు వెలుగు చూపడంతో ఇదేంటని ప్రశ్నించిన భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలను లాఠీలతో చితకబాదారు. నెత్తులు పగిలి నెత్త్తుర్లు కారుతున్నా కనికరించలేదు. అదేదో పెద్ద నేరమైనట్టు సంకెళ్లు వేసి విద్యార్థులను కారాగారం పాలుజేసారు. తలలు పగిలిన కార్యకర్తలు గాయాలతో బాధపడుతుంటే తీసుకెళ్లి లాకప్‌లో వేసారు. కనీసం వచ్చిన వారిని చూడనీయకుండా వారితో మాట్లాడనీయకుండా కర్కషంగా ప్రవర్తించారు.

ఇదేనా ప్రజాస్వామ్యం.. ఎక్కడుంది వాక్‌స్వాతంత్య్రం. అవినీతిని ప్రశ్నించకూడదా? లాకప్‌లోి గాయాలతో బాధపడుతున్న విద్యార్థుల పట్ల కనికరం చూపించని ఈ పోలీసులను ఏమనాలి.. ఈ తతంగాన్ని వెనక నుంచి నడిపిస్తున్న సూత్రదారులైన అధికారులను ఏమనాలి..? శిక్ష తప్పు చేసిన వారికా ప్రశ్నించిన వారికా....?



సుందర్

No comments:

Post a Comment