మా చిన్నన్న కొడుకు శ్రీచరన్. వాణ్ణి ఈ సంవత్సరం రెసిడెన్షియల్ హాస్టల్‌లో జాయిన్ చేశాము. లాస్ట్ వీక్ హాస్టల్‌కి వెళ్లి వాడికి ఇంకా మా తమ్ముళ్లు వేరేవాళ్లు ఉంటారు.. వాళ్లకు కూడా కావాల్సినవి ఇప్పించి అంతా బాగుందారా అని అడిగి చాలా సేపు వాళ్లతో స్పెండ్ చేశాను అప్పుడు చాలా బాగుంది బాబాయ్ అంటూ చెప్పిన వాడు. ఈ సండే నేను ఇంటికి వెళ్లే సరికి ఇంటి దగ్గర ఉన్నాడు. ఎప్పుడొచ్చావురా అంటే నిన్న వచ్చాన్ బాబాయ్ అన్నాడు. సర్లే అని మళ్లీ సిటీ వచ్చి మండే కూడా ఇంటికి వెళ్లాను మండే స్కూల్ ఉంటుంది వీడేంటి ఇంకా వెళ్లలేదు అనుకున్నా కానీ ఎందుకు వెళ్లలేదురా అని మాత్రం అడగలేదు. ఎందుకంటే నేనూ చిన్నప్పుడు హాస్టల్‌లో చదివేప్పుడు ఎవరన్నా ఎప్పుడెళ్తున్నావు రా.... అని అడిగితే ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది కాబట్టి వాణ్ణి అడగలేదు. ఇక మండే అలాగే గడిచింది ట్యూస్‌డే మార్నింగ్ పడుకుని ఉన్నాను 'వీడు హాస్టల్‌కు వెళ్లనంటున్నాడు జర సూడయ్యా' అని మా వదిన నున్ను నిద్ర లేపడంతో మెలువయ్యిది. ఏమైంది రా ఎందుకు వెళ్లవు అని వాళ్ల అమ్మా నాన్న అడుగుతున్నారు. కానీ నాకు కరెక్టుగా వాడిలో నేనే కనిపిస్తున్నాను. ఎందుకంటే కరెక్టుగా పది సంవత్సరాల క్రితం నేనూ కూడా హాస్టల్‌కు వెళ్లను అంటూ ఇంట్లో వాళ్లతో చెప్పాను. అప్పుడు ఈ ఒక్క సారికి హాస్టల్‌లో చదువురా మళ్లీ వచ్చేసారి ఇంటికి తీసుకొస్తాం అన్నారు నేను విన్లేదు. అయినా సరే టీసి ఇవ్వట్లేదు ఈ ఒక్కసారికి చదువురా అంటే గుడ్డిగా నమ్మి ఆ ఒక్కసంవత్సరం అని ఉంటే ఏకంగా 8 సంవత్సరాలు హాస్టల్లోనే చదివాను. వాణ్ణి కూడా అలాగే సముదాయించాను ఈ ఒక్కసారి చదువురా నెక్స్ట్ ఇయర్ మన ఊళ్లో చదువుదువుగానీ అన్నానేన్నేను. ఆ 'ఏమొద్దుపో నేను ఈన్నే సదువుతా' ఇది వాడి రియాక్షన్ సరే రా ఈ సారి టిసి ఇవ్వర్రా వచ్చే సారికి తీసుకుందాం అన్నాన్నేను వాడు చాలా ఫాస్ట్ ''ఏంకాదు ఇస్తున్నారు'' అన్నాడు. వాడిని సముదాయించడం ఎవ్వరితో అవ్వట్లేదు కనీసం హాస్టల్‌వద్దకు తీసుకెళ్తే అక్కడ వదిలి వస్తే వారం రోజుల్లో వాడే సెట్ అవుతాడని వాడిని హాస్టల్‌కు తీసుకెళ్ళి అక్కడే వదిలి వచ్చాను నెక్స్ట్ వీక్ మళ్లీ వెళ్లి చూడాలి.. ఏమంటాడో....? చూడాలి మరి!
సుందర్
మంచి చదువులకోసం తప్పటంలేదు...పిల్లలు అక్కడ మనం ఇక్కడ...తలుచుకుంటే గుండె పిండినట్లు ఉంటుంది...
ReplyDelete