నేనూ మా ఆఫీసు ఫ్రెండ్స్ (అమర్, పవన్, శ్రీకాంత్, రాజు, రాంచదంర్), కలిసి నైట్ డ్యూటీ అయిపోగానే మార్నింగ్ 4గ||కి టీ తాగటానికి వెళ్తుంటాము. వెళ్లే మార్గమధ్యలో మా చర్చలు ఓ రేంజ్‌లో జరుగుతాయి. అది దేనిగురించి అంటూ ప్రత్యేకించి ఉండదు. దేశ రాజకీయాలు కావచ్చు... సినిమాలు కావచ్చు... భవిష్యత్ ప్రణాళికలు కావచ్చు.. ఇక ప్రముఖ వ్యక్తుల గురించి కావచ్చు.... ఆ చర్చలు 3.30కి ఆఫీసు నుంచి వెళ్లేప్పుడు స్టార్టయితే మళ్లీ మార్నింగ్ 6గం||కి తిరిగి ఎక్కడి వారక్కడికి వెళ్లేదాకా సాగుతాయన్నమాట. ఈ మధ్య ఒక రోజు సాదారణంగా ఏదో చర్చసాగుతోంది. అనుకోకుండా.. అందులోకి స్టీఫెన్ హ్యాకింగ్ గురించిన మాట్లాడుతున్నాడు మా అమరన్న.. ఏదైనా ప్రశ్నించడం అలవాటున్న నేను ఎవరన్నా.. ఈ స్టీఫెన్ హ్యాకిన్ అన్నాన్నేను. అయితే ఇంతకు ముందు ఈ పేరెక్కడో విన్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు. మా గ్యాంగ్‌లో అందరినీ అడిగాడు నీకు స్టీఫెన్ హ్యాకిన్ తెల్సా తెల్సా అని.. కొద్ది మంది పేరు విన్నామని కొద్ది మంది తెలుసని అన్నారు. అప్పుడు అమర్ అన్నాడు బాబు నువ్వు వేస్టు... నీకు ఆయన కూడా తెల్వదా అని.... నాకు తెల్వదన్నా నువ్వు చెప్పు అన్నాన్నేను. నేను చెప్పను బాబు ఆయనగురించి తెలియదా...? ఇక నువ్వు వేస్టు బాబూ అంటాడు.. అరే అన్నా చాలా మంది గురించి వింటా కానీ అందరిగురించి గుర్తుండదు కదా అన్నా అన్నాన్నేను కానీ అయినా వినడు ఇదిగో ఈ పిల్లాడు అడిగినా చెప్పేవాణ్ణి నువ్వ అడుగుతావా? ఏం చదువుతున్నావు బాబు.. ఎంకామా... ఎక్కడ చదువుతున్నావు బాబూ అంటూ ఏదో విమర్శిస్తున్నాడు తప్ప మ్యాటరు చెప్పట్లేదు. ఇదిగో అన్న నాకు తెలియదు చెప్పన్నా చెప్పన్నా.. అని చాలా సార్లు బతిలాడితే.. ఇక చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త అతని బాడీలో ఏ పార్టు పనిచేయదు ఒక మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆయన ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అంతరిక్షంలో 'బ్లాక్‌హౌల్స్' గురించిన పరిశోధనలు చేస్తున్నాడు అని చెప్పాడు. మా రాజు అడిగాడూ.... అతని మెదడు మాత్రమే పనిచేస్తే మిగతా పార్టులేవీ పనిచేయకుంటే.. అతన ఎలా పరిశోదనలు చేస్తాడు అని అడిగాడు. అతని మెదడుకు కంప్యూటర్‌తో కనెక్షన్ ఉంటుంది. ఆయన ఆలోచనలను అది అందిస్తుంది దాని ద్వారా అతని సహాయకులు దాన్ని మాడిఫై చేస్తారు అని చెప్పాడు. అప్పుడన్నాన్నేను అన్నా ఆయన గురించి నాకు తెలుసు... ఒక శాస్త్రవేత్త ఉంటాడు అతనికి బాడీ పార్ట్స్ ఏవీ పనిచేయవు అయినా గొప్ప శాస్త్రవేత్త అని తెలుసు కానీ ఆయన పేరు స్టీఫెన్ హ్యాకిన్ అని నాకు తెలియదు... కావాలంటే నా బ్లాగులో 2010 సెప్టెబర్‌లోనేే ఆయనగురించిన ఐటమ్ ఒకటి పెట్టాను చూడు అన్నాన్నేను. ఆయన గురించి ఒక ఐటెమ్ రాసి ఆయన పేరు తెలియదంటావా అంటూ స్టార్ట్ చేసాడు మా అమర్ భయ్యా... అది ఎప్పుడాగి పోయిందంటే ఎక్కడివారు అక్కడికి వెళేలవరకూ క్లాసు అబ్బో.
సుందర్
No comments:
Post a Comment