ఆరడగుల ఆజానుబహుడు... కండలు తిరిగిన దేహం... గంభీరమైన ముఖం... దేనికీ భయపడని తత్వం.... చిన్నప్పటినుండి కాయకష్టం చేసి చేసి... కాళ్లు చేతులు బండబారిపోయాయి. ఎడమ చేతిమీద 'అమ్మ' గుండెపై కమ్యూనిస్టు సింబల్(సుత్తీకొడవలి నక్షత్రం గుర్తు) పచ్చబొట్టు కొట్టిచుకున్నాడు. దేన్ననయినా తేలికగా తీసుకునే తత్వం.. అతడు చాలా గంభీరంగా ఉంటాడు. తనకు జ్వరం వచ్చిందంటే నేను నమ్మలేదు... పోనీ వచ్చినా ఏదో లైట్‌గా వచ్చి ఉంటుందనుకున్నా... మాట్లాడటంలేదు చాలా సీరియస్‌గా ఉంది. అంటే ఈ రోజు (శుక్రవారం.5.8.11) ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాను. గేట్‌దగ్గర వాచ్‌మెన్ ఎంతమంది వెళ్తారు... అంటూ అడ్డగిస్తే... 'ప్రెస్' అనగానే మీరే ఇలా చేస్తే ఎలా సార్ అంటూ లోనికి పంపాడు. మా వాళ్లు అంతా ఒక బెడ్ చుట్టూ మూగి ఉన్నారు. బెడ్‌పైన మనిషిని చూడగానే 'షాక్'... అరే ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు.. ముఖం ఈడ్చుకుపోయింది. కాళ్లూ చేతులూ కట్టెపుళ్లల్లా అయ్యాయి. బాడీలో నిస్సత్తువ అసలు కదలడంలేదు. మాట పడిపోయింది. చేతికి ఒక సెలైన్‌బాటిల్ పెట్టారు. అప్పుడప్పుడు ఊపిరి తీసుకునేందుకే చలా కష్టపడుతున్నాడు... పరేషాన్ అయ్యాను. ఎలా ఉండే వాడు ఇలా అయ్యాడు. అసలు ఇలా ఎలా అయింది... అని అడిగితే... పక్కనుండి ఒకటే సమాదానం.. మత్తు పదార్థాలకు బానిస అవడం వలన.. గుట్కా.. సారా.. ఎక్కువ తీసుకోవడం వలన ఇలా జరిగింది అనగానే.. చాలా బాధ పడ్డాను. ఎప్పుడూ ధైర్యంగా కనిపించే అతడి కళ్లలోంచి నీళ్లు.. మత్తు పదార్థాలు వాడటం వల్ల మనిషి దెబ్బతింటాడు. ఆరోగ్యం కరాబవుతుంది అని పుస్తకాల్లో చదవడం తప్ప నిజ జీవితంలో చూడటం ఇదే ఫస్ట్ టైం.. మత్తు పదార్థాల పరిణామం ఇంత తీవ్రంగా ఉంటుందా.. ప్లీస్ ఫ్రెండ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి ఇది నా సజెషన్ కాదు రిక్వెస్ట్....
సుందర్
సుందర్
No comments:
Post a Comment