అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, September 28, 2011

ఎందుకంటే ...? ఆ కమ్మని స్వప్నం మాయవుట నాకిష్టంలేదు....!!!

చల్ల గాలిలో పల్లెటూరిలో...
పచ్చని చేల పక్కనెల్తుంటే .....
వినిపించెను ఒక తుంటరి నవ్వే....

నడిచే నేనా నవ్వుకు ఆగి...
ఒక పరి అటునే తరచి చూడగా...
 
"గాలికి చెదిరిన విరుల కురులు...

జాబిలి  మెరుపుల  మేని చాయ...

కాటుకద్దుకున్న కను రెప్పల గొప్పలు...

చిరు నవ్వుకు విరిసిన సొట్ట బుగ్గ....
మరి టెక్కుతో నిలిచిన  ముక్కుపుడక....
తడి పూసిన  గులాబి రేకుల పెదాలు...
శంకం ఒదిగిన మెడ వలపు....

నెలవంకను పోలిన నడుమొంపే...
అచ్చమైన తెలుగమ్మాయే...
ఆ ముచ్చటైన కులుకేం  మాయె..."

అబ్బో అబ్బో ఏమి అందము....

వర్ణించేందుకు మాటలు రాక....
కదిలేందుకు నా మనసోపక..
మైమరిచిపోయి నిల్చున్న  నన్నే...

టక్కున చూసెను సక్కని సిన్నది...
"ఆ కన్నులలో ఒక సన్నని బెరుకు...
మృధు కంఠ నరాల్లో ఏదో వణుకు...
తన పాపిటలో చిరు చెమటల మెరుపు....
చెంపల పై విరబూసిన ఎరుపు....


 
ఎందుకో నాకు  అర్థమవ్వక...
ఏమైందా  అని ఆరా తీస్తే...
నా కొంటె చూపు నొప్పించెనట....
తన హృదయలయను మార్చేసెనట...

ఇది కలయా నిజమా...
అని గిల్లుకున్న నాకింకా మెలకువ కాలేదు...
ఎందుకంటే ...?
ఆ కమ్మని స్వప్నం మాయవుట నాకిష్టంలేదు....!!!
సుందర్

No comments:

Post a Comment