(పదేండ్లనాటి నా పల్లెతల్లి.. మళ్ళీ కన్పించేరా.. )
కోక్కొరొకో.....కో.. అంటూ...
కోడిపుంజు కూతలు...
అంబా.. అంబా.. అంటూ..
ఆవుదూడ గెంతులు...!
గుమ్మం ముందేలాడే..
తాటాకుల పందిరీ..
ఇంటి సూరులుర్కులాడే
పిచ్చుకల కిరికిరీ...!
కోళ్ళు కమ్మే గంపలు
పసుల కొట్టే కొట్టాలు
కుర్థి తొట్టి.... సాంపి తొట్టి....
మూలకు మంచి నీళ్ళ తొట్టి...
సిరిగిపోయిన ....గుడిసెలు ....
ఇరిగిపోయిన... తలుపులూ ....
వాకిట్లో... మంచాలు
సొట్టవోయిన కంచాలు
కొత్త సుట్ట మింటికొస్తే
కోడికూర పొలావు....
ఎన్ని రోజుల కెదురయ్యే
ఎంతో మంచి గురుతులు...
(మా స్నేహితుడి పెళ్ళికి "మహబూబ్ నగర్"కు వెళ్ళినప్పుడు ఎదురైనా అనుభవాలు)
సుందర్
No comments:
Post a Comment